ఒక మనసు విడుదలకు ముందు ఆ సినిమాపై ఎన్ని అంచనాలో..? సినిమా ఎలాగున్నా సరే, నిహారిక కోసం మెగా ఫ్యాన్స్ పదే పదే చూస్తారని, ఆ సినిమా ఓపెనింగ్స్ కొల్లగొట్టడం ఖాయమని చెప్పుకొన్నారు. నిహారిక ఈ సినిమాలో టాప్ హీరోయిన్లకు దడ పుట్టిస్తుందని లెక్కలేసుకొన్నారు. తీరా చూస్తే… ఒక మనసు తుస్స్స్స్స్స్స్స్ మంది. అంతేనా..?? నిహారిక యాక్టింగు కూడా అంతంతమాత్రమే అని తేలిపోయింది. మెగా హీరోయిన్ అయినంత మాత్రన.. టికెట్లు తెగవని ఈ సినిమాతో రూఢీ అయ్యింది. దాంతో నిహారిక బాగా డీలా పడింది. ఈ రిపోర్ట్ చూసి నిహారిక పూర్తిగా నిరాశలో కూరుకుపోయిందని, ఎవ్వరితోనూ పెద్దగా మాట్లాడడం లేదని టాక్.
నిహారిక పరిస్థితి అటు నాగబాబునీ, ఇటు కుటుంబ సభ్యులనూ కాస్త కలవరపాటుకు గురి చేస్తోంది. ‘సినిమాల్లో ఇవన్నీ మామూలే..’ అంటూ నాగబాబు నిహారికను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నాడట. ‘ఈసారి మంచి కథ ఎంచుకొందాం..’ అంటూ నిహారికకు భరోసా ఇస్తున్నాడట. నిహారిక మాత్రం.. ‘ఇదే ఫస్టు.. ఇదే లాస్టు..’ అన్నట్టు మాట్లాడుతోందని టాక్. ఇక సినిమాల గురించి ఆలోచించకూడదన్న వైల్డ్ డిసీజన్ తీసుకొందట. అయితే నాగబాబు, వరుణ్ తేజ్, ఇతర మెగా హీరోలు కాస్త సర్దిచెబుతున్నట్టు వినికిడి. నిహారిక సినిమా చేస్తానంటే ఇప్పటికీ దర్శకులు రెడీగానే ఉన్నారు. కానీ నిహారిక కాస్త తేరుకోవాలంతే. మరి ఈ ఓదార్పు యాత్రలెంతవరకూ పనిచేస్తాయో, నిహారిక ఎంత త్వరగా కోలుకొంటుందో చూడాలి.