తెలుగులో నిఖిల్, స్వాతి జంటగా నటించిన ‘స్వామి రారా’ సినిమా హిట్ అయిన తరువాత వారిద్దరిది మంచి హిట్ కాంబినేషన్ అని గుర్తింపు వచ్చింది. మళ్ళీ త్వరలో వాల్లిద్దరూ కలిసి మరో సినిమా చేయబోతున్నారు. తమిళంలో ‘టైగర్’ అనే ఫ్లాప్ సినిమాకు దర్శకత్వం వహించిన ఆనంద్ తో వారు సినిమా చేయబోతున్నారు. దానిపై నిఖిల్ స్పందిస్తూ “ఒక సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయినంత మాత్రాన్న ఎవరినీ తక్కువ అంచనా వేయడానికి లేదు. ఆనంద్ చెప్పిన కధ నాకు చాలా నచ్చింది. అందుకే నేను ఆయనతో కలిసి సినిమా చేసేందుకు సిద్దపడుతున్నాను,” అని అన్నాడు. ఈ సినిమాలో మరో హీరోయిన్ పాత్ర కోసం నిత్యా మీనన్ లేదా రాధికా ఆప్టే పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
ప్రస్తుతం నిఖిల్ ‘శంఖరాభరణం’ అనే క్రైం కామెడీ సినిమా చేస్తున్నారు. దాని తరువాత ఆనంద్ తో కలిసి ఈ సినిమా చేసేందుకు సిద్దం అవుతున్నారు. ఈ రెండు సినిమాలు కాకుండా 2014లో స్వాతి, చందు మొండేటితో కలిసి చేసిన ‘కార్తికేయ’ సినిమాకు సీక్వెల్ చేసేందుకు కూడా సిద్దం అవుతున్నాడు.