నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. దీనికి `మోనార్క్` అనే పేరు పరిశీలిస్తున్నారు. ఈ సినిమాకి విలన్ ఎవరో ఇంత వరకూ ఫిక్స్ కాలేదు. ఈలోగా మరో సమస్య కూడా వచ్చి పడింది. ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్ర ఉంది. అందులో యువ హీరో కనిపించాలి. ఆ పాత్ర కోసం నిఖిల్ ని సంప్రందించింది చిత్రబృందం. కానీ నిఖిల్ ఈ సినిమాకి నో చెప్పినట్టు సమాచారం. ఆది పినిశెట్టి, నారా రోహిత్ లాంటి ఆప్షన్లూ ఈ సినిమా కోసం పరిశీలిస్తున్నారు. ఎవరు చేసినా.. హీరో స్థాయి ఉండాల్సిందే. ఆ నటుడెవరో ఫిక్స్ అయితే… ఓ కీలకమైన షెడ్యూల్ కి రూట్ క్లియర్ అయినట్టే. మరోవైపు ఈ సినిమాకి ఆర్థిక సమస్యలు ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. బడ్జెట్ పెరిగిపోయిందని, ఫైనాన్షియర్లు ఈ సినిమాకి కరువయ్యారని వార్తలొస్తున్నాయి. ఈ మాట ఎంత వరకూ నిజమో తెలీదు గానీ, ప్రస్తుతానికైతే… ఓ విలన్, ఓ యంగ్ హీరో ఈ సినిమాకి అత్యవసరం. మరి వాళ్లెప్పుడు దొరుకుతారో?