యువ హీరోల్లో మంచి ఊపుమీదున్న హీరో నిఖిల్ చిన్న వయసు నుండి సినిమాల్లో నటిస్తూ హీరోగా స్థిరపడ్డ నిఖిల్ హ్యాపీ డేస్ సినిమాలో రాజేష్ లా మన పక్కింటి కుర్రాడిలా కనిపించి అల్లరి చేశాడు. సినిమాలు చేస్తున్నా హిట్ కొట్టలేకపోతున్నాడని అనుకునే టైంలోనే సుధీర్ వర్మ తో కలిసి ‘స్వామిరారా’ లాంటి సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు నిఖిల్. డక్ మీదున్న సచిన్ ఒక్క ఫోర్ తో ఫాం తిరిగొచ్చినట్టు.. నిఖిల్ కూడా ఒక మంచి థ్రిల్లింగ్ హిట్ కొట్టి తలరాతని తానే మార్చుకున్నాడు.
ఆ తర్వాత అదే ఊపుమీద ‘కార్తికేయ’ తీసి హిట్ కొట్టాడు నిఖిల్. చివరగా వచ్చిన సూర్య వర్సెస్ సూర్య కూడా పర్వాలేదనిపించుకుంది. వరుసెంట హిట్లు కొడుతున్న నిఖిల్ ప్రస్తుతం మరో మూడు రోజుల్లో ‘శంకరాభరణం’ సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. అయితే ఎంత హీరో అయినా సరే ఇంట్లో వాళ్ల మాట వినక తప్పదు. అదీ పెళ్లి విషయంలో అయితే మరీను. అందుకే ఇనాళ్లు హీరోగా మంచి స్థానం సంపాధిచాక గాని పెళ్లి చేసుకోనని చెప్పాడట నిఖిల్. ఇప్పుడు వరుసెంట హిట్లు కొడుతున్నాడు కాబట్టి ఇక పెళ్లికి పచ్చ జెండా ఊపేశాడట.
కుర్ర హీరోల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న నిఖిల్ పెళ్లి గురించి ఇంట్లో వారితో ఇన్నాళ్లు పోట్లాడినా.. ఇక ఆపడం వల్ల కాక పెళ్లికి సై అన్నాడట. నిఖిల్ వాళ్ల తల్లి తండ్రులు ఇప్పటికే అమ్మాయిని వెతికే పనిలో పడ్డారట కూడా. వచ్చే ఏడాది వేసవిలో నిఖిల్ కు పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారు కుటుంబసభ్యులు. మరి నిఖిల్ కు ముకుతాడు వేసే అమ్మాయి ఎవరో తెలుసుకోవాలంటే వచ్చే వేసవి దాకా వెయిట్ చేయాల్సిందే.