నిఖిల్ కథానాయకుడిగా నటించిన చిత్రం కిర్రక్ పార్టీ. సంయుక్త హెడ్గే కథానాయికలుగా నటిస్తున్నారు. శరణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రామబ్రహ్మం సుంకర నిర్మాత. ఫిబ్రవరి 9న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాలేజీ బ్యాక్ డ్రాప్లో సాగే కథ ఇది. స్టూడెంట్ లీడర్‌గా నిఖిల్ కనిపించబోతున్నాడు. ఇటీవలే ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. నిఖిల్‌తో ఇది వరకు సినిమాల్ని తీసిన దర్శకులు సుధీర్ వర్మ. చందూ మొండేటి స్ర్కీన్ ప్లే, సంభాషణల్ని సమకూర్చడం విశేషం. అజనీష్ సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. నిఖిల్ లుక్ మాసీగా ఉంటుందని, మాస్లో తన ఇమేజ్ పెంచే సినిమా అవుతుందని చిత్రబృందం చెబుతోంది. త్వరలోనే టీజర్‌ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.