ఎన్నికల విషయంలో అన్ని పరిశీలించే నిర్ణయం తీసుకుంటామని.. ఎన్నికలు నిర్వహిస్తామని తాము ఎక్కడా చెప్పలేదని.. కేవలం హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించడానికే అన్ని పార్టీలు, ప్రభుత్వం నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నానని నిమ్మగడ్డ చెబుతున్నారు. ప్రభుత్వం అభిప్రాయం చెప్పడానికి తనతో సమావేశం అయిన ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ నీలం సహానికి అయన అదే విషయం స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో.. నిమ్మగడ్డ ఎన్నికలు పెట్టబోతున్నారని… దాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని ప్రకటనలు చేస్తూ వస్తున్న వైసీపీ నేతలల్లో .. తాము తొందరపడ్డామా అన్న భావన ఏర్పడుతోంది. కొద్ది రోజులుగా నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై వైసీపీ నేతలు మళ్లీ విమర్శలు చేస్తున్నారు. ఆయన ఎన్నికలు పెట్టబోతున్నారని.. కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో ఎన్నికలు ఎలా పెడతారని ప్రశ్నిస్తున్నారు.
నిజానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక ఎన్నికలు పెట్టబోతున్నట్లుగా ఎక్కడా చెప్పలేదు. తనంతట తాను ఆయన సంప్రదింపుల ప్రక్రియ కూడా ప్రారంభించలేదు. హైకోర్టులో దాఖలైన ఓ పిటిషన్ విషయంలో.., ఏపీ సర్కార్.. కరోనా వల్ల ఇప్పుడే స్థానిక ఎన్నికలు నిర్వహించలేమని అఫిడవిట్ వేసింది. అయితే..అలా చెప్పడానికి ప్రభుత్వానికేం అధికారం ఉందని… తన అభిప్రాయాన్ని ఎస్ఈసీకే తెలియచేయాలని సూచించింది. ఎస్ఈసీకి నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల కారణంగా ఎస్ఈసీ అన్ని పార్టీల అభిప్రాయాలను.. ప్రభుత్వ అభిప్రాయాలను తెలుసుకుని .., హైకోర్టుకు నివేదించాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రస్తుతం సంప్రదింపులు జరుపుతున్నారు.
ఎన్నికల కమిషన్‌కు రావాల్సిన నిధుల విషయంలో నిమ్మగడ్డ పిటిషన్ వేశారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిధుల్ని నిలిపివేసినట్లుగా ఆయన చెబుతూ.. కోర్టును ఆశ్రయించారు. ఆ సమయంలో.. ఎన్నికల నిర్వహణకు కూడా సహకరించడం లేదని.. చెప్పారు. ఆ విషయంతో వైసీపీ నేతల్లో.. ఆయన ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నట్లుగా ఊహించుకుని విమర్శల వర్షం కురిపిస్తున్నారు. హైకోర్టు తీర్పు ప్రకారం… నిమ్మగడ్డ ఎన్నికల విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఈ లోపు నిమ్మగడ్డపై విమర్శలు చేస్తూ.. వైసీపీ నేతలు.. రాజకీయ వ్యూహం అమలు చేస్తున్నారు.