సెర్బియా పోలీసులు పట్టుకున్నారని… తాను శుక్రవారం కోర్టుకు హాజరు కాలేకపోతున్నానని… ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్.. సీబీఐ కోర్టుకు తన లాయర్ ద్వారా సమాచారం పంపారు. జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్ కూడా కండిషనల్ బెయిల్ పై ఉన్నారు. ఆయన ప్రతి శుక్రవారం విచారణకు కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. అయితే అనూహ్యంగా ఆయన… ఐదు రోజుల క్రితం.. సెర్బియాలోని బెల్గ్రేడ్లో అక్కడి పోలీసులు ఆయనను అరెస్ట్ చేసిన విషయం బయట పడింది. కోర్టు అనుమతితోనే దేశం దాటాల్సిన నిమ్మగడ్డ.. అసలు సెర్బియా ఎప్పుడు వెళ్లారు..? ఎందుకు వెళ్లారు..? కోర్టు పర్మిషన్ ఉందా..? అనేక అనుమానాలు… ప్రజల్లో వచ్చాయి. నిమ్మగడ్డను ఎందుకు అరెస్ట్ చేశారన్నదానిపై… మీడియా కథనాలే కానీ.. ఎక్కడా క్లారిటీ లేదు.
చివరికి.. నిమ్మగడ్డనే.. తన లాయర్ ద్వారా..కోర్టులోనే… నిజం ఒప్పుకున్నారు. నిజంగానే.. తనను బెల్ గ్రేడ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని.. ఈ కారణంగా.. శుక్రవారం కోర్టులో హాజరు కాలేకపోతున్నానని న్యాయమూర్తికి లేఖ ద్వారా తెలిపారు. ఈ వ్యవహారంపై.. న్యాయమూర్తి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. కోర్టు అనుమతి ఎప్పుడు ఇచ్చింది..? ఏ దేశానికి వెళ్లేందుకు పర్మిషన్ తీసుకున్నారు..? ఏ దేశం వెళ్లారు..? అసలు సెర్బియాలో నిమ్మగడ్డ ప్రసాద్‌ను నిర్బంధించడానికి కారణాలేమిటి.. అన్న పూర్తి వివరాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దీంతో.. నిమ్మగడ్డ కేసులో.. చాలా వ్యవహారాలు బయటకు వస్తాయన్న ప్రచారం జరుగుతోంది.
వాన్ పిక్ ప్రాజెక్ట్‌లో రస్ అల్ ఖైమాను మోసం చేయడంతో… ఇంటర్ పోల్ నోటీసుల ఆధారంగా.. నిమ్మగడ్డను… బెల్గ్రేడ్లో అరెస్ట్ చేశారు. ఇప్పటికీ.. బెల్‌గ్రేడ్‌లోనే నిమ్మగడ్డ ఉన్నట్లుగా చెబుతున్నారు. ఒకటి రెండు రోజుల్లో.. కేసుకు సంబంధించిన లాంఛనాలు పూర్తి చేసి.. రస్ అల్ ఖైమాకు తరలిస్తారన్న ప్రచారం జరుగుతోంది. మరో వైపు వైసీపీ ఎంపీలు నిమ్మగడ్డ ప్రసాద్ ను విడిపించేందుకు కేంద్రంతో..సంప్రదింపులు జరుపుతున్నారు.