స్టేట్ ఎలక్షన్ కమిషన్ కార్యాలయంలో చేసిన వాస్తు మార్పులపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ సీరియస్ అయ్యారు. ఎవరు చెబితే ఆ మార్పులు చేశారో తనకు తెలియాలంటూ..విచారణకు ఆదేశించారు. నిమ్మగడ్డ తన ఆఫీసులో జరిగిన మార్పులపై విచారణకు ఆదేశించడానికి ఓ కారణం ఉంది. నిమ్మగడ్డ సోమవారం విజయవాడ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయంలో.. ఓ వర్గం మీడియా.. ఆయన తన ఆఫీసుకు వాస్తు మార్పులు చేసుకున్నారని.. ఓ మార్గం మూసి వేశారని విస్తృత ప్రచారం చేసింది. ఆయన ఎలా మళ్లీ ఆ పదవిలోకి వచ్చారో .. న్యాయపోరాటంలో ఆయన సాధించిన విజయం గురించి ఒక్కటంటే.. ఒక్క ముక్క చెప్పకపోయినప్పటికీ.. ఆయనకేదో వాస్తు పిచ్చి ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. ఇది ఆయన దృష్టికి వెళ్లడంతో… ఈ వాస్తు మార్పుల లెక్కేమిటో తేల్చాలనుకున్నట్లుగా తెలుస్తోంది.
నిజానికి ఎస్ఈసీ రమేష్ కుమార్ ను….తొలగించిన తర్వాత…ఎన్నికల సంఘం కార్యదర్శిని మార్చారు. అలాగే…మధ్యలో ఆర్డినెన్స్‌ను తీసుకు వచ్చి..లాక్ డౌన్ టైంలో… జస్టిస్ కనగరాజ్ అనే వ్యక్తిని ఎస్ఈసీగా నియమించారు. ఆయన బాధ్యతలు తీసుకుని… సమీక్షా సమావేశాలు కూడా నిర్వహించారు. ఆ తర్వాత ఆయన చెన్నై వెళ్లిపోయినప్పటికీ… కార్యాలయంలో మాత్రం మార్పులు జరిగాయి. ఈ మార్పుల్ని… కార్యదర్శి చేయించారా… లేకపోతే.. కనగరాజ్ చేయించారా..అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
తాను ఏదో మార్పులు చేయించినట్లుగా… మీడియా ప్రచారం చేయడంతోనే.. ఎవరు మార్పులు చేయించారో బయటపెట్టాలన్న ఉద్దేశంతోనే విచారణకు ఆదేశించినట్లుగా తెలుస్తోంది. తనకు సంబంధం లేకుండానే ఆ మార్పులు చేశారని నిమ్మగడ్డ చెబుతున్నారు. నిమ్మగడ్డ… వాస్తు లాంటి విషయాలను నమ్మరని తెలుస్తోంది.