ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ ..సెర్బియా నిర్బంధం నుంచి విడుదలయ్యారు. సెర్బియా పర్యటనకు వెళ్లిన ఆయనను..గత ఏడాది జూలై నెలాఖరులో అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రస్ అల్ ఖైమా అనే దేశాన్ని ఆయన వాన్ పిక్ ప్రాజెక్టులో మోసం చేయడంతో. .. ఆ దేశం ఇంటర్ పోల్ నోటీసులు జారీ చేసింది. దాని ప్రకారం.. ఆయనను సెర్బియా పోలీసులు అరెస్ట్ చేశారు. వాన్ పిక్ వాటాల వ్యవహారంలో నిమ్మగడ్డ పై రన్ అల్ ఖైమా ఫిర్యాదు చేసింది. గల్ఫ్ లోని ఓ చిన్న దేశం అయిన రస్ అల్ ఖైమా తో కలిసి… నిమ్మగడ్డ ప్రసాద్.. వాన్ పిక్ ప్రాజెక్టును జాయింట్ వెంచర్ గా ప్రారంభించారు. దీనికి అప్పటి ప్రభుత్వం 24 వేల ఎకరాలు కేటాయించింది. అయితే ఈ కేటాయింపుల వెనుక క్విడ్ ప్రో కో ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఈ కేటాయింపుల తర్వాత నిమ్మగడ్డ ప్రసాద్ జగన్ కంపెనీల్లోకి పెట్టుబడులు పెట్టారని సీబీఐ కేసులు నమోదు చేసింది. దాదాపుగా రూ. 850 కోట్లను.. నిమ్మగడ్డ ప్రసాద్ జగన్ సంస్థల్లోకి పెట్టుబడులుగా పెట్టారు. తర్వాత సీబీఐ కేసులు పడటంతో..ఆ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. వాన్‌పిక్‌కు చెల్లించాల్సిన సొమ్ములు కూడా చెల్లించలేదు. తాము పెట్టిన పెట్టుబడిలో.. నిమ్మగడ్డ ప్రసాద్ మోసం చేశారని.. రస్ అల్ ఖైమా ప్రతినిధులు… ఫిర్యాదు చేయడంతోనే అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. నిమ్మగడ్డను విడిపించడానికి .. వైసీపీ ఎంపీలు చాలా ప్రయత్నాలు చేశారు. మొదట్లోనే విదేశాంగ మంత్రి జైశంకర్‌కు.. ఉన్న పళంగా లేఖ రాశారు.
ఆ తర్వాత ఏపీ సర్కార్ కూడా..మరిన్ని ప్రయత్నాలు చేసినట్లుగా ప్రచారం జరిగింది. అప్పట్లోనే ఆయనకు సెర్బియాలో బెయిల్ లభించింది. అయితే.. దేశం వదిలి వెళ్లకూడదని షరతులు విధించింది. ఇప్పుడు.. సెర్బియా సుప్రీంకోర్టు… ఆ నిర్బంధాన్ని తొలగించడంతో ఆయన ఇండియాకు వచ్చినట్లుగా తెలుస్తోంది. విదేశాల నుంచి రావడంతో.. ఆయనను.. కరోనా కారణంగా క్వారంటైన్ సెంటర్ కు తరలించారు. పధ్నాలుగు రోజుల పాటు ఆయన క్వారంటైన్ సెంటర్లోనే ఉంటారు.