ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను ఎలాగైనా కంట్రోల్ చేయాలన్న లక్ష్యంతో ఉన్న వైసీపీ ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడంలేదు. పెద్దిరెడ్డి హౌస్ అరెస్ట్ విషయంలో ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు తీర్పు రాగానే ఆయనపై వైసీపీ నేతలు ఎటాక్ ప్రారంభించారు. నిజానికి హౌస్ అరెస్ట్ మాత్రం వద్దన్నారు.. కానీ తీర్పులో ఆయన మీడియాతో మాట్లాడవద్దని.. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవద్దని.. కోడ్ ఉల్లంఘనలకు పాల్పడవద్దని చాలా స్పష్టంగా చెప్పారు. అయినప్పటికీ.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాజ్యాంగ వ్యతిరేక ఉత్తర్వులు ఇచ్చారని ఆయనపై విరుచుకుపడుతున్నారు. వెంటనే.. ప్రివిలేజ్ కమిటీ చైర్మన్‌ను రంగంలోకి దింపారు. ఆయనకు శిక్ష తప్పదని .. రెడీగా ఉండాలని హెచ్చరికలు జారీ చేయించారు. అంతే కాదు..తాము తీసుకునే నిర్ణయం కోర్టులో కూడా చాలెంజ్ చేయలేరని ఆయన చెప్పుకొచ్చారు.
కాకాణి గోవర్ధన్ రెడ్డి మాటలకు విశేష ప్రాధాన్యం ఇవ్వాలని అనుకూల మీడియాకు వైసీపీ క్యాంప్ నుంచి సందేశాలు వెళ్లాయి. అందుకే ఒకటికి రెండు సార్లు బ్రేకింగ్‌లు వేసి.. కమింగ్ అప్లు ఇచ్చి.. ఏ శిక్ష విధిస్తారు..? లాంటి క్వశ్చన్లతో భయపెట్టాలని చూశారు. అదే సమయంలో ఇతర నేతలూ వెనక్కి తగ్గలేదు. ఇప్పటికే పెద్దిరెడ్డి లాంటి వాళ్లు మూడేళ్లు జైలు శిక్ష విధిస్తామని … కూడా వార్నింగ్‌లు ఇచ్చారు. అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం అదేమీ పట్టించుకోవడం లేదు. తాను చేయాలనుకున్నది చేసుకుంటూ వెళ్తున్నారు. మ్మగడ్డ రమేష్ కుమార్ మొదటి విడత పోలింగ్ కేంద్రాలను పరిశీలించేందుకు పోలింగ్ జరిగే రోజు … కడప జిల్లా పర్యటనకు వెళ్తున్నారు.
ఎన్నికల పరిశీలకులను కూడా ఆయా జిల్లాల్లోని ఎన్నికలు జరిగే రెవెన్యూ డివిజన్లలో విస్తృతంగా పర్యటించాల్సిందిగా కమిషన్ ఆదేశించింది. వారికి మెజిస్టీరియల్ అధికారాలు కూడా ఇప్పించారు. ప్రివిలేజ్ కమిటీ పేరు చెప్పి ఆయనను కంట్రోల్ చేయడానికి వైసీపీ చేయగలిగినంత చేస్తోంది. కానీ.. ఆయన మాత్రం ఏ మాత్రం భయపడక పోగా.. మరింత దూకుడుగా వెళ్తున్నారు. ఈ వార్ ఎటు దారి తీస్తుందోనని రాజకీయవర్గాలు ఆసక్తిగా ఎదుర ుచూస్తున్నాయి.