వాలంటీర్లు తాము చట్టాలకు అతీతమని అనుకుంటున్నారో… అంతకు మించి ప్రభుత్వమే తాము అని ఫీలవుతున్నారో కానీ.. వారు చేస్తున్న నేరాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. పలు చోట్ల.. అత్యాచారాలు.. అత్యాచారయత్నాలు వెలుగులోకి వస్తున్నాయి. మద్యం అక్రమ రవాణా దగ్గర్నుంచి పోలీసులపై దాడులకు పాల్పడటం వరకూ ఘటనలు చూస్తూనే ఉన్నాం. అంతకు మించి.. నెల్లూరు జిల్లాలో ఓ వాలంటీర్ అభం శుభం ఎరుగని.. తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ బాలిక పరిస్థితి చూసి.. వైద్యులే కన్నీరు పెట్టుకోవాల్సిన పరిస్థితి. వారే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం పెదరాజుపాళెం గ్రామంలో వాలంటీర్‌గా.. పవన్ కల్యాణ్ అనే యువకుడు పని చేస్తున్నాడు. ఆ గ్రామంలో తానే ప్రభుత్వం అన్నట్లుగా తిరుగుతూ ఉంటాడు. అలా.. ప్రభుత్వ పథకాల్ని పొందే వారిని బెదిరిస్తూ.. గదమాయిస్తూ తిరిగేవాడు. అలా.. గురువారం ఊళ్లో జనం ఎవరూ లేని సమయంలో… ఓ ఇంట్లో.. తొమ్మిదేళ్ల బాలిక కనిపించింది. ఆ బాలికకు మాయమాటలు చెప్పి.. ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. తర్వాత పారిపోయాడు. ఆ బాలిక తల్లిదండ్రులు ఇంటికి వచ్చి చూసేసరికి పాప పరిస్థితి దారుణంగా ఉంది. వెంటనే ఆస్పత్రికి తరలించారు. బాలిక పరిస్థితి చూసి వైద్యులే చలించిపోయారు. వైద్య సిబ్బంది పోలీస్‌స్టేషన్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు.
నిందితుడిపై పోలీసులు నిర్భయ కేసు నమోదు చేశారు. అదుపులోకి తీసుకున్నారు. పలు జిల్లాల్లో వాలంటీర్లపై ఇప్పటికే ఇలాంటి కేసులు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లాలో కొద్ది రోజుల కిందట.. మద్యం మత్తులో ఉన్న ఓ వాలంటీర్.. ఏకంగా మహిళా ఎస్ఐ పైనే బూతులతో విరుచుకుపడటం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వాలంటీర్లు.. చెబితే ప్రభుత్వ పథకాలు అందుతూండటంతో.. చాలా మంది.. తాము చెప్పిందే వేదమన్నట్లుగా వ్యవహరిస్తూ.. అరాచకాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో.. దొంగతనాలు.. అత్యాచారాలు.. మద్యం అక్రమ రవణాల్లోనూ పాలు పంచుకుంటున్నారు.