మంచు ఫ్యామిలీలో ఏర్పడిన వివాదం అంతకంతకూ పెద్దది అవుతోంది. మనోజ్, ఆయన తండ్రి మోహన్ బాబు పోటాపోటీగా ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇక్కడి వరకూ వచ్చిందంటే అన్ని ప్రయత్నాలు విఫలమయి ఉంటాయని అనుకోవచ్చు. అయితే మనోజ్, మోహన్ బాబులకు సర్ది చెప్పే విషయంలో కుటుబంసభ్యులు కూడా ఎందుకు ఫెయిలయ్యారన్నది ఆసక్తికరంగా మారింది.
మోహన్ బాబుకు ముగ్గురు పిల్లలు. మొదటి ఇద్దరి పిల్లలు మంచు లక్ష్మి, విష్ణు. మొదటి భార్య సంతానం. ఆమె చనిపోవడంతో.. ఆమె సోదరి అయిన నిర్మలను రెండో పెళ్లి చేసుకున్నారు మోహన్ బాబు. ఆమెకు పుట్టిన సంతానం మనోజ్. అంటే ప్రస్తుతం మనోజ్ అసలు తల్లి నిర్మల. అయితే ఎప్పుడూ అలాంటి బేధం వారి మధ్య కనిపించలేదు. కానీ ఇప్పుడు ఇంత గొడవ జరుగుతున్న కుమారుడికి నిర్మల సర్దిచెప్పలేకపోతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఈ వివాదంలో ఆమె పేరు కూడా వినిపిస్తోంది.
మోహన్ బాబు పోలీసులకు డయల్ 100కు కాల్ చేసినప్పుడు మనోజ్ తనతో పాటు తన భార్యపైనా దాడి చేశారని ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. మనోజ్ రాసిన లేఖలో అందరూ ఎవరికి వారు వెళ్లిపోతే తన తల్లికి తోడుగా ఉండేందుకు మళ్లీ తమను ఇంట్లోకి పిలిచారని మనోజ్ చెబుతున్నారు. తాము ఆస్పత్రికి వెళ్తే తమ నెలల బిడ్డను తమ అమ్మకే అప్పచెప్పి వచ్చామని ఆయన అంటున్నారు. అంటే.. ఈ వ్యవహారంలోకి నిర్మలను మోహన్ బాబు, మనోజ్ లాగారని అనుకోవచ్చు.
ఇప్పుడు ఈ వివాదం సద్దుమణగాలంటే.. ఆమె వల్ల సాధ్యమవుతుందని అంటున్నారు. అటు మోహన్ బాబుకు.. ఇటు మనోజ్ తో మాట్లాడి ఇంటి పరువును కాపాడుకోవచ్చని చెబుతున్నారు. కానీ ఆమె మాటను కూడా ఇద్దరూ వినడం. లేదా ?