రాఫెల్ డీల్ విషయంలో స్కాం జరగలేదని చెప్పి తమను తాము సమర్థించుకోవడానికి భారతీయ జనతా పార్టీ చేస్తున్న ప్రయత్నాలు .. పార్లమెంట్ వేదికగా నవ్వుల పాలవుతున్నాయి. ఈ ఒప్పందాన్ని సమర్థించుకుంటూ… ఈ రోజు రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్… చాలా సేపు ప్రసంగించారు. రాపెల్ డీల్ లో అసలు ప్రధాన ఆరోపణ… హిందూస్థాన్ ఏరో నాటిక్స్ ను కాదని… రిలయన్స్ కు ఎందుకు అఫ్ సెట్ పార్టనర్ గా చేర్చుకున్నారేదే. అది యుద్ధ విమానాల తయారీ కంపెనీ చాయిస్ అంటూ… వాదిస్తున్నా…ఈ రోజు పార్లమెంట్ లో మాత్రం.. హెచ్ఏఎల్ పనికి మాలిన సంస్థ అని నిర్మలా సీతారామన్ వాదించేశారు. అంతే కాకుండా.. అతి తమ సర్టిఫికెట్ కాదని.. కాంగ్రెస్ పార్టీనే ఇచ్చిందని చెప్పుకొచ్చారు. భారత్లో హిందూస్థాన్ ఏరో నాటిక్స్ లిమిటెడ్ ద్వారా 108 విమానాల తయారీకి దసాల్ గ్యారంటీ ఇవ్వలేదని ఇప్పుడు హాల్ కోసం కాంగ్రెస్ మొసలి కన్నీరు కారుస్తోందని నిర్మలా సీతారామన్ ఆరోపించారు.
హాల్ గొప్పల్నే తప్ప లోపాల్ని కాంగ్రెస్ ప్రస్తావించడం లేదని వాదించారు. తమ మా హాయాంలో హిందూస్థాన్ ఏరో నాటిక్స్ లిమిటెడ్ సామర్థ్యాన్ని రెట్టింపు చేశామనిగొప్పగా చెప్పుకున్నారు. అలా చెప్పుకున్న తర్వాత కూడా హిందూస్థాన్ ఏరో నాటిక్స్ లిమిటెడ్ ఏడాదికి కేవలం 8 తేజస్ విమానాల్ని మాత్రమే తయారుచేయగలదని తేల్చారు. 43 విమానాలు ఆర్డరిస్తే హిందూస్థాన్ ఏరో నాటిక్స్ లిమిటెడ్ కేవలం 8 విమానాలే అందజేసింది చెప్పుకొచ్చారు. అంతే కాదు.. రాఫెల్ తయారీ హాల్ జన్మహక్కా? అంటూ చెలరేగిపోయారు. ఇంత గొప్పగా హిందూస్థాన్ ఏరో నాటిక్స్ లిమిటెడ్ ను.. తీసి పడేసిన నిర్మలా సీతారామన్… మరి పేపర్లపైనే ఉన్న.. ఇంత వరకూ.. ఒక్క విమానం తయారు చేసిన అనుభవం కూడా లేని.. అనిల్ అంబానీ కంపెనీ రిలయన్స్ డిఫెన్స్.. అంత పెద్ద కాంట్రాక్ట్ ను ఎలా…అందుకుందో కూడా చెప్పాల్సింది.
హిందూస్థాన్ ఏరో నాటిక్స్ లిమిటెడ్ కే చేతకానిది అసలు ఇంకా భూమి కూడా లేని … రిలయన్స్ డిఫెన్స్… ఎలా తయారు చేస్తుందో కూడా.. నిర్మలా సీతారామన్ చెప్పాల్సింది. కానీ పార్లమెంట్ కేవలం.. హిందూస్థాన్ ఏరో నాటిక్స్ లిమిటెడ్ కి సామర్థ్యం లేదని చెప్పి కూర్చున్నారు. రిలయన్స్ సామర్థ్యం గురించి కూడా చెప్పాల్సింది. కానీ చెప్పలేదు..!