టాలీవుడ్ హీరోల్లో పవన్ కల్యాణ్‌కి ఉన్న అరివీర భయంకరమైన ఫ్యాన్ ఎవరంటే.. నితిన్ పేరే చెబుతారంతా. ప్రతీ వేడుకలోనూ పవన్‌పై అభిమానాన్ని చాటుకొంటూనే ఉన్నాడు నితిన్. పవన్ కూడా అంతే. ఎవరు అడిగినా ‘నో’ చెబుతాడేమో గానీ, నితిన్ అడిగితే ‘నో’ చెప్పలేడు. నితిన్‌ని ఓ సొంత తమ్ముడిలా భావిస్తాడు. నితిన్ మైకు పట్టుకొంటే పవన్ గురించి రెండు ముక్కలైనా చెప్పాల్సిందే. మరోసారి ‘లై’ ఆడియో ఫంక్షన్లో నితిన్ పవన్ గురించి స్పీచ్ ఇచ్చి.. పవర్ స్టార్ అభిమానుల్ని ఆకట్టుకొనే ప్రయత్నం చేశాడు.
”ఈ ఆడియో ఫంక్షన్‌కి కల్యాణ్‌గారు రాలేదు. కానీ త్రివిక్రమ్ గారు వచ్చారు. ఆయనొస్తే.. కల్యాణ్ గారు వచ్చినట్టే. కల్యాణ్‌గారు నిర్మాతగా మారి తీస్తున్న తొలి చిత్రం నా 25వ సినిమా కావడం నా అదృష్టం. ఓ అభిమానిగా ఇంతకంటే కావల్సిందేముంది” అంటూ పవన్ పై తనకున్న అభిమానం మరోసారి చాటుకొన్నాడు. పవన్, త్రివిక్రమ్‌లు కలసి నితిన్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘లై’ తరవాత ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది.