నితిన్ కెరీర్‌కి స్పీడు బ్రేకర్లు వేసిన సినిమా ‘లై’. ఈ సినిమాపై చాలా అంచనాలు పెంచుకున్నారు జనాలు. కతీరా చూస్తే.. అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమా విడుదలయ్యాక… మీడియాతో పెద్దగా టచ్ లో లేకుండా పోయాడు నితిన్. ఇప్పుడు ఆ సినిమా ఫ్లాప్ గల కారణాలు బయటపెట్టాడు. ”లై మంచి సినిమానే. ప్రశాంతంగా చూడాల్సిన ఓ తెలివైన సినిమా. మధ్యలో ఫోన్ వచ్చిందని దృష్టి మరలిస్తే… కనెక్షన్ కట్ అయిపోతుంది. అంత ఏకాగ్రతతో సినిమాచూడలేకపోయారు. పైగా ఈ సినిమాని విడుదల చేసిన టైమ్ కూడా సరైంది కాదు, మూడు సినిమాల మధ్య `లై` వచ్చింది. ఏ సినిమా చూడాలో ప్రేక్షకులు తేల్చుకోలేకపోయారు” అన్నాడు నితిన్. అయితే ఈ కథ ఒప్పుకున్నందుకు, ఈ సినిమా చేసినందుకు కాస్త కూడా ఫీల్ అవ్వడం లేదట. ”నాకు నచ్చే ఈ సినిమా చేశా. దర్శకుడు చెప్పింది చెప్పినట్టు తీశాడు. ఇప్పటికీ ఈ సినిమా అంటే నాకు ఇష్టం” అని చెప్పుకొచ్చాడు నితిన్.