నితిన్ టాలెంటెడ్ హీరో. తన ఖాతాలో మంచి విజయాలు ఉన్నాయి. రాజమౌళి, త్రివిక్రమ్, పూరి జగన్నాథ్, వినాయక్ లాంటి స్టార్ దర్శకులతో పని చేసే అరుదైన అవకాశాన్ని దక్కించుకొన్నాడు. వరుసగా 13 ఫ్లాపులు ఎదుర్కొని ‘ఇష్క్’తో గ్రేటెస్ట్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఈమధ్యకాలంలో తన సినిమాలు సరిగా ఆడలేదు. అయితే ‘రాబిన్ హుడ్’తో బౌన్స్ బ్యాక్ అవుతానని గట్టిగా నమ్ముతున్నాడు నితిన్. ఈనెల 28న ‘రాబిన్ హుడ్’ విడుదల అవుతోంది. ఈ సందర్భంగా తెలుగు 360తో నితిన్ మాట్లాడారు. ఈ ఇంటర్వ్యూ హైలెట్స్ ఇవీ..
* ‘రాబిన్ హుడ్’లో కొత్తరకమైన ఫన్ ఉంటుంది. రెగ్యులర్ పంచ్ డైలాగులు ఉండవు. ఒక్క ప్రాస కూడా వినిపించదు. క్లైమాక్స్ కూడా కొత్తగా డిజైన్ చేశాం. రెగ్యులర్ కమర్షియల్ సినిమా క్లైమాక్స్‌లా మాత్రం ఉండదు.
* వెంకీ కుడుముల చాలా ప్రతిభావంతుడు. ‘అ.ఆ’ టైమ్ నుంచి నాకు తెలుసు. ఆ సినిమాకి తను సహాయ దర్శకుడిగా పనిచేశాడు. ‘ఛలో’ తరవాత కలిసి ‘భీష్మ’ కథ చెప్పాడు. అప్పటి నుంచీ మా ట్రావెలింగ్ కొనసాగుతోంది. తను మంచి రైటర్. త్రివిక్రమ్ శిష్యుడు. ఆయన టింజ్‌ని వెంకీ పట్టుకొన్నాడు. ‘స్వయంవరం’, ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘అతడు’ టైమ్ లో త్రివిక్రమ్ రైటింగ్ ఎలా అనిపించిందో.. ఇప్పుడు వెంకీ కుడుముల రైటింగ్ స్టైల్ చూస్తే అలా అనిపిస్తుంది.
* శ్రీలీల మంచి డాన్సర్. అయితే ఈ సినిమాలో తనకు డాన్స్ చేసే అవకాశం చాలా తక్కువగా వచ్చింది. తనలోని ఓ మంచి నటిని సినిమాలో చూస్తారు.
* నా కెరీర్లో ఓ దశలో వరుసగా 13 ఫ్లాపులు వచ్చాయి. ‘ఇష్క్’తో మళ్లీ నిలదొక్కుకొన్నా. ఫ్లాపు సినిమాలు తీసినా ‘నితిన్ బాగా చేయలేదు’ అని ఒక్కరు కూడా నన్ను తిట్టుకోలేదు. కొన్ని సినిమాలు కథలు బాగోలేక ఆడలేదు. మరికొన్ని మంచి కథలు ఎంచుకొన్నా సరిగా తీయలేకపోయాం.
* నా కథల విషయంలో నాదే జడ్జిమెంట్. తప్పో.. ఒప్పో బాధ్యత పూర్తిగా నాదే. నా ఫ్లాపులకు మరొకర్ని నిందించలేను.
* పాటల విషయంలో, అందులోనూ స్టెప్పుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం సహజమే. అయితే కేవలం స్టెప్పుల వల్ల సినిమాలు ఆడవు. పాటలు బాగున్నా సినిమా ఫ్లాపయిన సందర్భాలు చాలా ఉన్నాయి.
* విక్రమ్ కె.కుమార్ తో ఓ స్పోర్ట్స్ డ్రామా చేస్తున్నా. అన్నీ అనుకొన్నట్టు జరిగితే.. తెలుగు చిత్రసీమ గర్వపడే సినిమా అవుతుంది.
* ‘ఎల్లమ్మ’ కథ విన్నాను. చాలా బాగుంది. హీరోయిన్ గా సాయి పల్లవిని అనుకొన్నా.. ఆమె డేట్లు సర్దుబాటు కావడం లేదు. మరో హీరోయిన్ని వెదుక్కోవాలి. విక్రమ్ కుమార్ సినిమా, ‘ఎల్లమ్మ’ రెండూ ఒకేసారి షూటింగ్ జరుపుకొంటాయి.
పూర్తి ఇంటర్వ్యూ కోసం ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.