గాయని సునీత రెండో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. `మ్యాంగో` రామ్ తో సునీత కు ఇటీవలే నిశ్చితార్థం జరిగింది. వచ్చే నెలలో రామ్ – సునీత పెళ్లి చేసుకోబోతున్నారు. నిజానికి ఈ నెలలోనే వీళ్ల పెళ్లి జరగాల్సివుంది. అయితే.. కొన్ని కారణాల వల్ల పెళ్లి వాయిదా పడింది. అయితే.. సునీత మాత్రం చిత్రసీమలోని తన సన్నిహితులకు ఓ పార్టీ ఇచ్చింది. ఈ పార్టీని నితిన్ హోస్ట్ చేయడం విశేషం. మ్యాంగో రామ్.. నితిన్‌కి అత్యంత సన్నిహితుడు. అందుకే… నితిన్ ఆధ్వర్యంలోనే ఈ పార్టీ జరిగింది. గచ్చిబౌలీలోని ఓ స్టార్ హోటెల్లో ఈ పార్టీ గ్రాండ్ గా జరిరిగింది. గాయనీ గాయకులు, సంగీత దర్శకులు, నిర్మాతలు, దర్శకులు ఈ పార్టీలో పాల్గొని కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.