నితిన్ పెళ్లి పనులు మొదలైపోయాయి. స్నేహితురాలు షాలినితో ప్రేమలో పడ్డ నితిన్.. పెద్దల అనుమతితో పెళ్లికి సిద్ధమైన సంగతి తెలిసిందే. నెల 26 రాత్రి 8:30 గంటలకు వివాహం జరరగోతోంది. ఇప్పుడు శుభలేఖల్ని కూడా స్వయంగా పంచి పెడుతున్నాడు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ని ఈరోజు వ్యక్తిగతంగా కలిసిన నితిన్…. తన పెళ్లికి రమ్మంటూ ఆహ్వానించాడు. ఏప్రిల్ లోనే నితిన్ పెళ్లి జరగాల్సింది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ నెల 22 నుంచి పెళ్లి హంగామా ప్రారంభం కాబోతోంది. 23న మెహందీ ఫంక్షన్ వుంటుందని, 24న ప్రీ మ్యారేజ్ ఫంక్షన్ ఏర్పాటు చేస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. లాక్ డౌన్ నిబంధనలు వర్తిస్తున్నాయి కాబట్టి.. పెళ్లికి నితిన్ కి అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరవుతారని తెలుస్తోంది.