‘మహాభారతంలో ధర్మాన్ని కాపాడటం కోసం లక్షలాది మంది తమ సమాధులను పునాధులుగా వేశారు.. మాచర్ల నియోజక వర్గంలో ధర్మాన్ని కాపాడటానికి నా సమాధిని పునాదిగా వెయ్యడానికి… నేను సిద్ధం’ అంటున్నాడు నితిన్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజాగా చిత్రం మాచర్ల నియోజక వర్గం. కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటిస్తు ఈ చిత్రంలో అంజలి స్పెషల్ నంబర్ రారా రెడ్డిలో సందడి చేయనుంది.
ఈ సినిమా నుండి యాక్షన్ ధమ్కి అంటూ ఒక స్పెషల్ టీజర్ రిలీజ్ చేశారు. ఇందులో యాక్షన్ డైలాగ్ చూపించారు. నితిన్ ఐఎఎస్ అధికారిగా మాచర్ల లో ఎలాంటి సవాళ్ళు ఎదురుకున్నాడనేది ఈ చిత్రంలో కధాంశం. ఇందులో సముద్రఖని ప్రతినాయకుడు. ఇప్పటికే విడుదలు ఈ సినిమా పాటలు పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి భారీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎమ్.ఎస్.రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.