భీమ్లా నాయక్తో హిట్టు కొట్టాడు సాగర్ చంద్ర. కానీ తనకు రావాల్సిన క్రెడిట్ మాత్రం రాలేదు. ఈ సినిమాకి సంబంధించిన ప్లస్ పాయింట్స్ ఏమైనా ఉంటే, అవన్నీ త్రివిక్రమ్ పట్టుకెళ్లిపోయాడు. భీమ్లా నాయక్కి కర్త, కర్మ, క్రియ అన్నీ త్రివిక్రమే అని టాలీవుడ్ గట్టిగా నమ్మింది. అందుకే…. సాగర్ చంద్రని ఎవరూ పట్టించుకోలేదు. ఎట్టకేలకు… ఇప్పుడు సాగర్ చంద్రకు ఓ ఆఫర్ వచ్చింది. నితిన్ నుంచి. సాగర్ చంద్ర – నితిన్ కాంబో దాదాపుగా సెట్టయిపోయిందని ఇన్ సైడ్ వర్గాల టాక్. నితిన్ ప్రస్తుతం `మాచర్ల నియోజక వర్గం`తో బిజీగా ఉన్నాడు. ఆ తరవాత…. వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తాడు. ఇప్పటికే వక్కంతం వంశీ సినిమా మొదలైపోయింది. కొంతమేర షూటింగ్ జరిగింది. `మాచర్ల…` పనులు పూర్తయిన వెంటనే.. తన డేట్లన్నీ.. వక్కంతం సినిమాకి కేటాయిస్తాడు. సెప్టెంబరు నుంచి సాగర్ చంద్ర సినిమా పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన అన్ని విషయాలూ త్వరలోనే అధికారికంగా బయటకు రానున్నాయి.