నితిన్ కథానాయకుడిగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. ‘భీష్మ’తో సూపర్ హిట్ కొట్టిన జోడీ ఇది. కాబట్టి అంచనాలు భారీగానే ఉన్నాయి. మైత్రీ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దీనికి ‘రాబిన్వుడ్’ అనే పేరు ఖరారు చేశారు. రిపబ్లిక్ డే సందర్భంగా గ్లింప్స్ ని కూడా విడుదల చేశారు. ”డబ్బు చాలా చెడ్డది. రూపాయీ రూపాయి నువ్వేం చేస్తావ్ అంటే, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ల మధ్య చిచ్చు పెడతాను అంటుంది. అన్నట్టే చేసింది. దేశమంత కుటుంబం నాది. ఆస్తులు ఉన్నవాళ్లు నా అన్నదమ్ములు, ఆభరణాలు ఉన్నవాళ్లు నా అక్కచెల్లెళ్లు” అంటూ రాబిన్ హుడ్గా తన సిద్ధాంతం నితిన్ వాయిస్ ఓవర్లో వినిపించింది. ఉన్నవాళ్లని దోచుకొని, లేనివాళ్లకు పెట్టడం రాబిన్ వుడ్ స్టైల్. ఈ సినిమాలో హీరో పాత్ర కూడా అదే విధంగా ఉండబోతోందని గ్లింప్స్ చూస్తే అర్థం అవుతోంది. కాకపోతే.. ‘ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్’ అనే మాటని అడ్డుపెట్టుకొని, ఎవరి చేబుల్లో అయినా చేయి పెట్టడం నా హక్కు.. ఎందుకంటే ఇదంతా నా ఫ్యామిలీ అనుకొనే క్యారెక్టరైజేషన్ కొత్తగా అనిపిస్తోంది. ఇంతకు మందు ఈ చిత్రంలో కథానాయికగా రష్మిక ని తీసుకొన్నారు. ఆమె స్థానంలోకి శ్రీలీల వచ్చింది. ఇప్పుడు శ్రీలీల కూడా ఈ సినిమా నుంచి తప్పుకొంది. అందుకే కథానాయిక కోసం చిత్రబృందం అన్వేషిస్తోంది.