నితిన్ ‘రాబిన్హుడ్’ ఈ పాటికి రిలీజై ఓటీటీలోకి కూడా వచ్చేసేది. కానీ నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన పెద్ద సినిమా ‘పుష్ప’ కారణంగా రాబిన్హుడ్ వెనక్కి వెళ్ళిపోయింది. సంక్రాంతి అటు ఇటు గా వద్దామని అనుకున్నారు కానీ నిర్మాతలకి పుష్ప వివాదం చుట్టుకుంది. దీని తర్వాత మరో డేట్ కోసం చూసిన నితిన్.. ఇప్పుడు ఏకంగా సమ్మర్ కి వెళ్ళిపోయాడు. మార్చి 28న సినిమా వస్తోంది.
మార్చి 28 అంటే.. అనుకున్న సమయానికి దాదాపు ఐదు నెలలు గ్యాప్ వచ్చేసినట్లే. ఫెబ్రవరి లో ఎదో డేట్ అనుకున్నారు కానీ తండెల్, లైలా, దిల్ రుబా, మజాకా, అలాగే నితిన్ నుంచి వస్తున్న మరో సినిమా తమ్మడు కూడా ఫెబ్రవరిలోనే వున్నాయి. మార్చి నుంచి పరీక్షలు మొదలైపోతాయి. దీంతో దాదాపు ఏప్రిల్ కి షిఫ్ట్ అయిపొయింది రాబిన్హుడ్.
నితిన్ తో భీష్మ లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాన్ని తీసిన వెంకీ కుడుముల ఈ సినిమాకి దర్శకుడు కావడం, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం, శ్రీలీల హీరోయిన్.. జివి ప్రకాష్ కుమార్ మ్యూజిక్.. ఇవన్నీ కూడా రాబిన్హుడ్ ఎట్రాక్షన్స్. నితిన్ కొన్నాళ్ళుగా మంచి విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. గ్యాప్ వచ్చినప్పటికీ రాబిన్హుడ్ సక్సెస్ అయితే అదే హ్యాపీ.