అ..ఆ… ఇదో లేడి ఓరియెంటెడ్ సినిమా, త్రివిక్రమ్ అచ్చంగా సమంత కోసమే తీస్తున్న సినిమా, ఇందులో నితిన్ పాత్రకు అంత ప్రాధాన్యం లేదన్నది ఇన్సైడ్ వర్గాల టాక్. ఈ సినిమాపై గుప్పుమన్న మహాగట్టి పుకారు కూడా ఇదే. కానీ.. ఈ టీమ్‌లో ఎవరిని అడిగినా `ఇందులో మేం ఎవ్వరం హీరోలం కాదు. కథే హీరో` అని తెలివిగా తప్పించుకొని తిరుగుతున్నారు. అయితే.. ఇప్పుడు ప్రమోషన్లలోనూ సమంత డామినేషనే ఎక్కువగా కనిపిస్తోందన్నది నిజం. పోస్టర్లు, ట్రైటర్లు, ప్రోమోలు ఇలా ఏం చూసినా ప్రతీ చోట సమంత హవానే నడుస్తోంది. ఈ సినిమా కోసం హైదరాబాద్‌లో భారీ ఎత్తున ఫ్లెక్సీలూ, లాలీపాల్లూ ఏర్పాటు చేశారు. అక్కడా సమంత నే బాగా ఫోకస్ అవుతోంది.
ఈ విషయంపై ఇటు నితిన్ కూడా కాస్త చిర్రుబుర్రులాడుతున్నట్టు టాక్. ఫ్లెక్సీలలో, పోస్టర్లలో తనకీ కాస్త ప్రాధాన్యం ఇవ్వమని.. నితిన్ గోల పెడుతున్నాడట. అయితే పోస్టర్ డిజైన్ వ్యవహారం, దాన్ని ఓకే చేసే అధికారం కేవలం త్రివిక్రమ్‌కి మాత్రమే ఉండడంతో ఎవ్వరూ ఏం చేయలేక చేతులు ఎత్తేస్తున్నారట. దాంతో నితిన్.. త్రివికమ్ ముందు అడగలేక, అలాగని కామ్‌గా ఉండలేక…సతమతమవుతున్నాడని టాక్. ఇంకెంత..? మరో రెండు రోజులు ఆగితే.. అ.ఆ లో హీరో ఎవరో, చివరికి విలన్‌గా మిగిలేది ఎవరో తేలిపోతుంది. అందాక వెయిట్ అండ్ సీ.