నితిన్ కెరీర్ ఇప్పుడు ఒడిదుడుకుల్లో ఉంది. వరుస ఫ్లాపులు ఇబ్బంది పెట్టాయి. ఇప్పుడు తనకు అర్జెంటుగా ఓ సాలీడ్ హిట్ కావాలి. అది `రాబిన్వుడ్`తో దొరుకుతుందన్న నమ్మకంతో ఉన్నాడు నితిన్. ఈనెల 28న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. సినిమా అవుట్ పుట్ చూసుకొన్నాడు నితిన్. ఎప్పుడైతే నితిన్ సినిమా చూశాడో, అప్పుడే కాన్పిడెన్స్ లెవల్స్ పెరిగిపోయాయి. ‘నా కెరీర్లో, దర్శకుడు వెంకీ కుడుముల కెరీర్లో ‘రాబిన్ వుడ్’ చాలా పెద్ద హిట్ అవుతుంది. సినిమా చూశాక నేనూ దర్శకుడు మాట్లాడుకొన్నాం, ప్రేమించుకొన్నాం, కామించుకోబోయి ఆగిపోయాం’ అంటూ జోక్ చేశాడు నితిన్. తను సరదాగానే అన్నా, ఈ సినిమాపై తన నమ్మకం నిజం అవుతుందన్న ఆశ.. నితిన్ మాటల్లో కనిపించింది.
మరోవైపు దర్శకుడు వెంకీ కుడుముల కూడా ఇదే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాడు. సినిమా హిట్టయితే ఆ క్రెడిట్ తన టీమ్ కే ఇస్తానని, ఫ్లాప్ అయితే ఆ బాధ్యత తనదని, విమర్శకులు తనకు టార్గెట్ చేయడానికి రెడీగా ఉండొచ్చని చెప్పుకొచ్చాడు వెంకీ కుడుముల. తనకు మంచి కామెడీ సెన్స్ వుంది. ఇది వరకు వచ్చిన రెండు సినిమాలూ కమర్షియల్ గానూ వర్కవుట్ అయ్యాయి. ఈ సినిమాతో మరో మెట్టు పైకి ఎక్కుతానన్న నమ్మకాన్ని వ్యక్తం చేశాడు వెంకీ కుడుముల. ఇప్పటి వరకూ తాను చేసిన సినిమాల్లో ‘రాబిన్వుడ్ ది బెస్ట్’ అని బల్లగుద్దీ మరీ చెబుతున్నాడు. ప్రమోషన్లు కూడా కొత్తగానే ప్లాన్ చేసింది టీమ్. ఈనెల 18న గానీ, 20న గానీ ట్రైలర్ విడుదల చేస్తారు.