వైసీపీ అధినేత జగన్ ని ఏమైనా అంటే చంపేస్తానంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి వార్నింగ్ ఇస్తూ సోషల్ మీడియాలో వచ్చిన ఒక వీడియో సంచలనం సృష్టించింది . అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం నిందితుణ్ణి గుర్తించి అరెస్ట్ చేసింది. వివరాల్లోకి వెళితే ..
గుంటూరు కి చెందిన తియ్యగూర వెంకటరెడ్డి అనే ఒక వ్యాపారి పై రౌడీ షీట్ ఉంది. ఇటీవల పవన్ కళ్యాణ్ , జగన్ పై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దీనితో జగన్ అభిమాని అయిన వెంకట రెడ్డి కి కోపం వచ్చింది. పవన్ ని దుర్భాషలాడుతూ, జగన్ ని ఏమైనా అంటే చంపుతానంటూ వార్నింగ్ ఇస్తూ ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. అయితే ఈ వీడియో పోలీసుల దాకా చేరడం తో అప్రమత్తమైన గుంటూరు అర్బన్ పోలీసులు నిందితుణ్ణి గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు.
అయితే వెంకట రెడ్డి మాత్రం తాను మద్యం మత్తులో ఆ వీడియో చేసానని చెప్పుకొచ్చాడు. ఇతను హీరో నితిన్ ఫ్యాన్స్ సంఘం అధ్యక్షుడిగానూ, దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి ఫ్యాన్స్ అధ్యక్షుడిగానూ కొనసాగుతున్నాడు.