ఒక్క సినిమాతో టాలీవుడ్‌ని తన వైపుకు తిప్పుకొన్నాడు విజయ్ కుమార్ కొండా. గుండెజారి గల్లంతయ్యిందే చూసి.. యువహీరోలంతా కొండా వైపు దృష్టి మరల్చారు. రెండో సినిమా ఛాన్స్ నాగచైతన్యకు దక్కింది. ఒక లైలా కోసం ఫ్లాప్ అవ్వడంతో.. విజయ్ కుమార్ కొండా పై పెట్టుకొన్న ఆశలన్నీ అడియాశలయ్యాయి. దాంతో విజయ్‌తో మరో సినిమా చేయడానికి హీరోలెవ్వరూ ముందుకు రాలేదు. ఇప్పుడు విజయ్‌కి మళ్లీ నితిన్ నుంచి పిలుపొచ్చింది.
నితిన్ – విజయ్ కుమార్ కొండా కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కనుంది. శ్రేష్ట్ మూవీస్ పతాకంపై నితినే ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మించబోతున్నాడు. ఆల్రెడీ.. కథ ఓకే అయిపోయిందట. అఆ అవ్వగానే ఈ సినిమానే పట్టాలెక్కించాలని నితిన్ భావిస్తున్నాడు. ఫ్లాపుల్లో ఉన్నా.. తనకు ఓ హిట్టిచ్చాడన్న అభిమానంతో కొండాకు ఈ సినిమా నితినే ఆఫర్ చేశాడట. మరి నితిన్ మరో హిట్టిచ్చి.. ఇండ్రస్ట్రీలో తనని తాను నిలుపుకొంటాడేమో చూడాలి.