నిత్యమీనన్ మంచి నటి. ఆ మాటకొస్తే అద్భుతమైన నటి. తెలుగు చిత్రసీమలో ఉన్న అతికొద్ది మంది సహజ నటీమణుల్లో నిత్య ఒకరు. మణిరత్నం ఫ్రేముల్లో ఎంత అందంగా కనిపించిందో. అయితే.. ఈమధ్య నిత్య బాగా లావైపోయింది. ఫ్రేములు పట్టలేనంత, 70 ఎమ్ ఎమ్ తెర సరిపోనంత బొద్దెక్కిపోయింది. అలాంటప్పుడు… మరీ ఇంత లావైపోతున్నారేంటి? అని ప్రశ్నించడం చాలా సహజం. దానికి నిత్య షాకింగ్ సమాధానం చెబుతోంది. ‘నా నటనని చూడండి.. నా అవతారాన్ని కాదు’ అంటూ కాస్త ఘాటుగానే స్పందించింది. ఈ విషయంలో నిత్య దృక్పథం మారితే మంచిదేమో అనిపిస్తోంది. నిత్య నుంచి ఆశించేది గ్లామర్ కాదు. అంత వరకూ ఓకే. కానీ మరీ ఇంత బొద్దుగా తయారైపోతే ఎలా?? నిత్య పక్కన పెద్ద హీరోలు నటించడానికి ఒప్పుకోవడం లేదు. యంగ్ స్టర్స్‌తో నటించాల్సివస్తే నిత్య మరీ అక్కలా కనిపిస్తోందేమో అన్నది సందేహం. నిత్యలాంటి కథానాయికలు పరిశ్రమకు అవసరం. ఆమెలాంటి నటీమణులు ఇంకొన్ని సినిమాలైనా చేయాలి. ఇలా లావైపోతుంటే… తనకు రావల్సిన పాత్రలు దక్కకుండా పోతాయి. నిత్య మరీ లావుగా మారిందన్న ఒకే ఒక్క కారణంతో ‘మహానటి’ ఛాన్స్ మిస్ చేసుకొంది. ఆ సినిమా పడి ఉండే.. నిత్య కెరీర్లో ఓ మైలు రాయి లాంటి సినిమా అయ్యిండేది. ఈ విషయాన్ని నిత్య గమనిస్తే మంచిది.