నిత్యమీనన్ మంచి నటి. గొప్ప పెర్ఫార్మర్. చిన్న సీన్ ఇచ్చినా… చింపేస్తుంది. మణిరత్నం లాంటి దిగ్గజ దర్శకులే.. ఆమెను చూసి ముక్కున వేలేసుకొన్నారు. అందుకే పెర్ఫార్మ్సెన్స్ ఓరియెంటెడ్ పాత్రలన్నీ ఆమెను వెదుక్కొంటూ వెళ్లిపోతున్నాయి. అయితే.. సెట్లో నిత్య ప్రవర్తన మాత్రం దర్శక నిర్మాతలకు తలనొప్పులు తీసుకొస్తోందని టాక్. క్రమశిక్షణ విషయంలో నిత్యని ఏమీ అనలేం గానీ.. ఆమెతో పనిచేయడం మామూలు విషయం కాదంటూ, కొంతమంది దర్శకులు గుసగుసలాడుకొంటున్నార్ట. వాళ్ల స్వీయ అనుభవాల్ని ఏకరువు పెడుతున్నార్ట.
ఏ దర్శకుడైనా ‘వన్ మోర్’ అని చెబితే.. అందరి ముందు సదరు దర్శకుడ్ని నిత్య నిలదీసేస్తోందట. ‘వన్ మోర్ ఎందుకు చేయాలి? నేను చేసిన తప్పేంటి? క్లారిటీ ఇవ్వాల్సిందే ‘అంటోందట. దర్శకుడు క్లారిటీగా చెప్పగలిగితే ఓకే. లేదంటే వన్మోర్ చేయనుగాక చేయను అంటోందట. సీన్లో నిత్య బాగాచేసినా, మరో యాక్టర్ తప్పు వల్ల ఆ షాట్ రీటేక్ చేయాల్సివస్తుంది. అలాంటప్పుడు మరీ దారుణమట. ‘మరో యాక్టర్ తప్పు చేస్తే.. నేనెందుకు మళ్లీ చేయాలి’ అంటూ నిలదీస్తోందట. నిత్య నటన సూపర్గానీ.. ఆమెతో సినిమా చేయడం అనుకొన్నంత సులభం కాదని దర్శకులు వాపోతున్నారు. మరి నిత్య టెక్కో… లేదంటే తనంత నటి లేదనుకొంటోందో ఆమెకే తెలియాలి.