ఈ వారం విడుదలైన సినిమాల్లో రెండూ ఫట్టే. అన్నిటికంటే మించి… ఒక్క అమ్మాయి తప్ప బాగా నిరాశ పరిచింది. సందీప్ కిషన్, నిత్యమీనన్, చోటా కెనాయుడు… ఈ ముగ్గురూ కలసి ఏదో మ్యాజిక్ చేస్తారని ప్రేక్షకులు ఆశించారు. తీరా చూస్తే సినిమా తుస్సుమంది. అసలు ఇలాంటి కథని, ఇలాంటి సినిమాని నిత్య ఎందుకు ఒప్పుకొంది? ఆమె జడ్జిమెంట్ దెబ్బతిందా? అన్న అనుమానాలు రేకెత్తాయి. అయితే… ఈసినిమా వర్కవుట్ అవ్వదని నిత్యమీనన్ ముందే చెప్పిందట. ఈ సినిమా కథ రెండేళ్ల క్రితమే నిత్యకు నినిపించారు. అప్పట్లో నిత్య ‘నో’ చెప్పింది. ”ఫ్లై ఓవర్‌పై సినిమా అంటే వర్కవుట్ అవ్వదు. లొకేషన్ మారదు కాబట్టి, సినిమా బోర్ కొట్టే ఛాన్స్ ఉంది” అందట. నిత్యకు ఈ సినిమా చేయడం ఇష్టం లేదనుకొని.. చిత్రబృందం మరో కథానాయిక దగ్గరకు వెళ్లిందట. అయితే అప్పట్లో ఈ సినిమా పట్టాలెక్కినట్టే ఎక్కి ఆగిపోయింది.
మళ్లీ ఇదే స్ర్కిప్టు పట్టుకొని నిత్య దగ్గరకు వెళ్లారట… చోటా కెనాయుడు. ‘నువ్వుంటే ఈ సినిమాకి హెల్ప్ అవుతుంది’ అని చోటా.. రిక్వెస్ట్ చేయడం వల్లే.. నిత్య ఈ సినిమా ఒప్పుకొందని తెలుస్తోంది. అయితే ఆబ్లికేషన్స్ పై సినిమా చేయడం నిత్య కెరీర్‌కు అంత మంచిది కాదేమో అనిపిస్తోంది. వరుసగా ఇలాంటి ఫ్లాపులు రెండు తగిలితే.. నిత్య కెరీర్ డామేజీలో పడిపోతుంది. అప్పుడు ఆమెను ఎవ్వరూ కాపాడలేరు.