నిత్యానంద అంటే.. ప్రత్యేకంగా గుర్తు పట్టాల్సిన పని లేదు. రంజిత నిత్యానంద అని ప్రత్యేకంగా గుర్తు చేసేసుకుంటారు. కొన్ని వివాదాలు అలా వారికి .. సంబంధం లేని విషయాల్లో గుర్తింపు తెస్తూ ఉంటాయి. ఇటీవలి కాలంలో వేషభాషలు మార్చి.. చిత్రవిచిత్రమైన స్పీచ్‌లు ఇస్తూ.. సాఫ్ట్ వేర్ కుర్రాళ్లను అటు ప్రత్యక్షంగా.. ఇటు ఆన్‌లైన్‌లోనూ ఆకట్టుకుంటున్న ఈ నయా తరం స్వామిజీ పరారయ్యాడు. అదీ కూడా.. తన రేంజ్ లోనే. దొంగ పాస్ పోర్ట్‌తో.. ఆస్ట్రేలియాకు పరారయ్యారట. అంతగా నిత్యాంద భయపడాల్సిన కేసులు నమోదయ్యాయి మరి.
తమ ఇద్దరు కూతుళ్లను కిడ్నాప్ చేశారంటూ.. గుజరాత్‌కు చెందిన దంపతులు నిత్యానందపై కేసు పెట్టారు. అహ్మదాబాద్‌లోనూ.. యోగిని సర్వగ్యపీఠం అనే ఆశ్రమాన్ని ప్రారంభించారు. నిర్వహణను కొంత మందికి అప్పగించారు. అప్పుడప్పుడూ వెళ్లి వస్తూంటారు. ఈ ఆశ్రమాల్లో… తమ పిల్లలను కొంత మంది భక్తులు చేరుస్తూంటారు. తమ నలుగురు పిల్లల్ని అలా చేర్చిన దంపతులు.. తర్వాత వారిని తీసుకెళ్లాలనుకున్నారు. ఇద్దరు మైనర్లను పంపిన ఆశ్రమ నిర్వాహకులు..మేజర్లైన ఇద్దర్ని పంపలేదు. దాంతో.. వారు కేసు పెట్టారు. ఈ వ్యవహారంలో అహ్మదాబాద్‌లోని ఆయన అనుచరులైన ప్రణప్రియానంద, ప్రియతత్వ రిద్ది కిరణ్ అనే మహిళల్ని అరెస్టు చేశారు.
తల్లిదండ్రులు కేసు పెట్టడంతో.. పోలీసులు ఆయా ఆశ్రమాల్లో సోదాలు చేశారు. కొంత మంది చిన్నారు కూడా ఉండటంతో.. ఆ చిన్నారులను బాలకార్మికులుగా మార్చి వారితో ఆశ్రమ ప్రచార కార్యకలాపాలు, డొనేషన్ల వసూళ్లకు వాడుకుంటున్నారని నిర్ధారించి.. పోలీసులు కేసు నమోదు చేశారు. చిన్నారులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా నిత్యానంద స్వామిపైనా కేసులు నమోదు చేశారు. ఓ మైనర్ బాలిక.. నిత్యానందపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఈ కేసు నుంచి గట్టెక్కాలంటే.. పరారవడం మంచిదని.. నిత్యానంద నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.