సినిమా పరిశ్రమలో ఒక హీరో కాదన్న సినిమా మరో తీసి సూపర్ హిట్ కొడుతుంటాడు అది సర్వసాధారణమే.. అయితే ఒకవేళ ఆ సినిమా హిట్ అయితే మనం చేస్తే బాగుండేది అని బాధపడే హీరోలు అదే సినిమా పోతే మాత్రం హమ్మయ్య అని గాలి పీల్చుకుంటారు. ఇప్పుడు నితిన్ తన మనసులో అదే ఫీల్ అవుతున్నాడు అంటున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన సినిమా ‘లోఫర్’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా కథ కథనాల్లో లోపం వల్ల సినిమా అంత హిట్ టాక్ తెచ్చుకోలేదు.
అయితే ముందు ఈ సినిమా నితిన్ తో మొదలు చేసి చిత్రీకరణకు కూడా మొదలు పెట్టారు దర్శకుడు పూరి. అయితే ఆ సందర్భంలో ఇద్దరి మధ్య వ్యవహారం చెడి సినిమా నుండి నితిన్ తప్పుకోవడం జరిగింది. అయితే సినిమా నితిన్ చేసి ఉంటే ఎలా ఉండేదో ఏమో కాని ఇప్పుడు సినిమా ఫ్లాప్ అని తెలీయగానే కాస్త ఊపిరి పీల్చుకున్నాడట.
మొన్నీమధ్యే కొరియర్ బోయ్ కళ్యాణ్ అంటూ వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకోలేని నితిన్ మళ్లీ సంక్షోభంలో పడ్డాడనే అనిపిస్తుంది. ప్రస్తుతం దర్శకులతో కథా చర్చల్లో ఉన్నాడట. మరి నితిన్ భవిష్యత్ ని నిర్ధేశించే సినిమా ఏదై ఉంటుందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది.