బ్యాంకులకు వేల కోట్లు పంగనామాలు పెట్టి.. విదేశాలకు పరారవుతున్న పెద్దల జాబితాలో.. మరో గుజరాతీ బడా వ్యాపార వేత్త చేశారు. ఆయన గుజరాతీ మాత్రమే కాదు.. బీజేపీలోని పెద్దలందరికీ అత్యంత సన్నిహితుడు. బ్యాంకలుకు దాదాపుగా రూ. 5,700 కోట్లు రుణాల రూపంలో తీసుకుని చెల్లించకుండా.. జెండా ఎత్తేశాడు. చాలా మందుగానే ప్రణాళికలు వేసుకున్నట్లు ఉన్నాడు.. నేరుగా ఆఫ్రికా దేశం నైజీరియా వెళ్లిపోయాడు. అక్కడైతే కోర్టులు..కేసులు.. చింతలు కూడా ఉండని కావొచ్చు. గుజరాత్ ఫార్మా రంగంలో పేరెన్నికగన్న నితిన్ సందేసర అనే పారిశ్రామికవేత్త బ్యాంకుల దగ్గర .. దాదాపుగా రూ. 5,700 కోట్లు అప్పులు చేశారు. అవన్నీ మొండి బకాయిలుగా మారిపోయాయి.
నితిన్‌కు చెందిన స్టెర్లింగ్ బయోటెక్ గ్రూప్ ప్రమోటర్లు నకిలీ, తప్పుడు డాక్యుమెంట్లతో పలు బ్యాంకుల నుంచి ఈరుణాలు తీసుకున్నారు. అసలు కాదు కదా.. వడ్డీ కూడా కట్టడం లేదు. ఇలా బ్యాంకుల నుంచి తీసుకున్న మొత్తాన్ని మనీలాండరింగ్ ద్వారా.. దారి మళ్లించాడు. చాలా వరకు.. విదేశాలకు తరలించేశాడు. ఇలా రుణాలు తీసుకోవడం.. అక్రమంగా తరలించడంపై.. ఫిర్యాదులు రావడంతో.. ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. నితిన్‌ను గతనెలలో దుబాయ్‌లో పోలీసులు అరెస్ట్ చేశారని ప్రచారం జరిగింది కానీ.. మధ్యలో ఏమయిందో… ఏమో.. ఆయన నైజిరియాకు పారిపోయినట్లు ప్రస్తుతం… కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్రా బ్యాంక్, యూకో బ్యాంక్, ఎస్బీఐ, అలహాబాద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి బ్యాంకుల కన్సార్షియం నితిన్‌కు రుణాలను మంజూరు చేసింది.
బీజేపీ అగ్రనేతలకు అత్యంత సన్నిహితుడైన ఈ వ్యాపారవేత్త… ముందుగానే చాలా మంచి ప్రణాళికతో ఉన్నట్లు ఉన్నారు. కుటుంబ సభ్యులందర్నీ.. చాలా మందుగానే నైజీరియాకు తరలించారు. ఇప్పుడు ఈ నితిన్‌ను తీసుకు రావడం… కేంద్ర ప్రభుత్వం వల్ల కాదు. మాల్యా, మోడీ, చోక్సీల్లా… వదిలేయాల్సిందే. బహుశా.. కేంద్రం ఉద్దేశం కూడా అదే అయి ఉండవచ్చనే విమర్శలు సహంజంగానే వస్తాయి.