బీహార్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనుండటంతో ఎన్డీఏలో కీలక మిత్రపక్షంగా ఉన్న జేడీయూ పక్క చూపులు చూసేందుకు ప్రయత్నిస్తోంది. ఎప్పుడు ఏ కూటమిలో ఉంటాడో తెలియని నితీష్ కుమార్ ఇటీవలి కలంలో ఆర్జేడీకి బాగా దగ్గరగా ఉంటున్నారు. లాలూతో సమావేశాలు కావడం.. తేజస్వితో స్నేహపూర్వకంగా ఉండటం వంటివి చేస్తున్నారు.. ఆయన తీుతో బీజేపీలోనూ అనుమాాలు వ్యక్తమవుతున్నాయి.
కేంద్రంలో బీజేపీ కూటమి ప్రభుత్వంలో జేడీయూ కూడా కీలకమే. టీడీపీ తర్వాత ఎక్కువ మంది ఎంపీలు ఆ పార్టీకి ఉన్నారు. అయితే రాజకీయాల్లో ఓ స్టాండ్ అంటూ లేకుండా ఇండియా, యూపీఏ కూటముల మధ్య అటూ ఇటూ తిరిగే నితీష్.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం పావులు కదుపుతున్నారు. బీజేపీతో అంటీ ముట్టనట్లుగా ఉన్న ఆయన.. ఎక్కువ సీట్ల కోసం బీజేపీని బ్లాక్ మెయిల్ చేయడానికా లేకపోతే.. ప్రశాంత్ కిషోర్ కొత్త పార్టీని తట్టుకోవాలంటే.. బీజేపీ కూటమి నుంచి బయటకు వచ్చి ఆర్జేడీతో కలవాలనుకంటున్నారేమోన్నన సందేహాలు కూడా వస్తున్నాయి.
జేడీయూ కూటమి నుంచి వెళ్లిపోియనా కేంద్రానికి వచ్చే సమస్యేమీ లేదు. కానీ చంద్రబాబు ప్రయారిటీ మరింత పెరుగుతుంది. చంద్రబాబు మీదనే ఆధారపడి ప్రభుత్వం ఉన్న పరిస్థితికి వస్తుంది. ఇది చంద్రబాబు ప్రయారిటీని మరింతగా పెంచుతుంది. నిలకడలేని రాజకీయంగా నితీష్ కుమార్ పై బీజేపీ కూడా అంత ఎక్కువ ఆశలు పెట్టుకోవడం లేదు. చంద్రబాబుపై మాత్రం గట్టి నమ్మకం ఉంచుకుంటోంది.