రానా కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం `విరాట పర్వం`. వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో కథానాయికల ప్రాబల్యం ఎక్కువగానే కనిపిస్తోంది. రానా పక్కన సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది. ప్రియమణి, నందితాదాస్, జరీనా వాహబ్… ఇలా కథానాయికల ప్రాబల్యం ఎక్కువగానే కనిపిస్తోంది. తాజాగా ఈ చిత్రంలో మరో కీలకమైన పాత్ర కోసం నివేదా పేతురాజ్ని ఎంచుకున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది కూడా. ఈ షెడ్యూల్ లోనే.. నివేదా సెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. అభ్యుదయ భావాలు, నక్సలిజం.ప్రేమ వీటి మధ్య సాగే కథ ఇది. స్త్రీ శక్తిని కూడా దర్శకుడు బలంగా చెప్పాలనుకుంటున్నాడు. అందుకే బలమైన స్త్రీ పాత్రల్ని రాసుకున్నాడట వేణు ఉడుగుల. ఆయా పాత్రల కోసం పేరున్నవాళ్లనే ఎంచుకోవాలని, అప్పుడు ఈ సినిమా మైలేజీ మరింత పెరుగుతుందని సురేష్ బాబు భావిస్తున్నాడు. అందుకే.. కథానాయికల సంఖ్య ఇలా పెరుగుతూ వస్తోంది.