విశ్వక్సేన్కి కథానాయిక నివేదా పేతరాజ్ ఓ మంచి కాంప్లిమెంట్ ఇచ్చింది. విశ్వక్‌లో అటు త్రివిక్రమ్, ఇటు లోకేష్ కనకరాజ్ ఉన్నారని తెగ పొగిడేసింది. విశ్వక్సేన్ కథానాయకుడిగా నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం ‘దాస్ కా ధమ్కీ’. ఇందులో నివేదా హీరోయిన్. దాస్కా దమ్కీ ప్రమోషన్లలో నివేదా విరివిగా పాల్గొంటోంది. ఈ సందర్భంగా తన దర్శకుడ్ని, హీరోనీ ఆకాశానికి ఎత్తేస్తోంది. సెట్లో… విశ్వక్‌ని చూస్తుంటే తనకు త్రివిక్రమ్ గుర్తొస్తారని, విశ్వక్ కూడా సెట్లో త్రివిక్రమ్ లా ఎనర్జిటిక్‌గా ఉంటాడని పొగిడేసింది నివేదా. అంతే కాదు.. విశ్వక్ దగ్గర చాలా మంచి కథలు ఉన్నాయని, వేరే హీరోతో సినిమా చేస్తే, నెక్ట్స్ లెవల్లో ఉంటుందని, ముఖ్యంగా గ్యాంగ్ స్టర్ కథలు విశ్వక్ బాగా డీల్ చేస్తాడని, ఒకవేళ విశ్వక్ గ్యాంగ్ స్టర్ సినిమా తీస్తే… లోకేష్ కనకరాజ్ స్థాయిలో సినిమాని తీర్చిదిద్దుతాడని చెప్పుకొచ్చింది.
విశ్వక్ ఏ హీరోతో సినిమా తీస్తే బాగుంటుందన్న విషయంలో.. ఓ సలహా కూడా ఇచ్చింది. బాలయ్యతో విశ్వక్ కాంబో బాగుంటుందని చెప్పింది. బాలయ్య మాస్ హీరో అని, తనని విశ్వక్ బాగా చూపించగలడని తన అభిప్రాయాన్ని వెల్లడించింది. బాలకృష్ణ హీరోగా విశ్వక్ దర్శకత్వంలో ఓ సినిమా రూపుదిద్దుకోనుందని ఇటీవల వార్తలొచ్చాయి. అందుకే… నివేదా కూడా ముందస్తు హింట్ ఇచ్చిందేమో..?