ఇటీవల వెలుగు చూసిన డ్రగ్స్ కేసు తమిళనాడు రాజకీయాలని ఓ కుదుపు కుదిపింది. హీరో, ప్రస్తుత డిఎంకె ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ డ్రగ్స్, అక్రమ వ్యాపారంలో పాలుపంచుకున్నారని తమిళనాట ప్రముఖ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ సవుక్కు శంకర్ కథనాలు వెల్లడించారు. పనిలో పనిగా ఉదయనిధి వ్యక్తిగత వ్యవహారాలపై కూడా వార్తలు రాశాడు. హీరోయిన్ నివేదా పేతురాజ్, ఉదయనిధి స్టాలిన్ కి మధ్య కాస్ట్లీ రిలేషన్ వుందని, రూ. 50 కోట్లుతో దుబాయ్ లో ఇల్లుకొని ఆమెను అక్కడికి షిఫ్ట్ చేశాడంటూ రాసిన కథనాలు వైరల్ అయ్యాయి.
కాగా దీనిపై నివేదా స్పందించింది. ’16 సంవత్సరాల నుంచి ఇండిపెండెంట్గా ఉంటున్నా. నాకు ఎవరినీ డబ్బులు అడిగే అవసరం లేదు. ఇప్పటికీ మేము దుబాయ్లో అద్దె ఇంట్లోనే ఉంటున్నాం. నా కుటుంబం కోరుకున్నట్లు సమాజంలో గౌరవంగా జీవించాలనుకుంటున్నా. ఒక అమ్మాయి గురించి ఇలాంటి వార్తలు రాసేముందు ఆలోచించుకోండి. నిజాలు తెలుసుకొని రాయండి. తప్పుడు రాతలు రాయొద్దు” అని ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు.
2016లో తమిళ సినిమాతో నటిగా కెరీర్ ని స్టార్ట్ చేసిన నివేదా తమిళ్ తో పాటు పలు తెలుగు సినిమాల్లో నటించారు. 2017లో పొదువగా ఎమ్మనసు తంగం అనే చిత్రంలో ఉదయ్ నిధి స్టాలిన్ తో కలిసి స్క్రీన్ పంచుకున్నారు. గత ఏడాది విశ్వక్ సేన్ తో చేసిన దాస్ కా ధమ్కి లో నటించారు.