సమంత త్వరలోనే ‘అక్కినేని’ సమంత అవ్వబోతోంది. నాగచైతన్య, సమంత ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారన్నది ఓపెన్ సీక్రెట్టే. ఒకరి పేర్లు ఒకరు చెప్పకపోయినా.. సమంత, నాగచైతన్యల పెళ్లి ఖాయమైందని, ఈ యేడాది చివర్లో ఇద్దరూ ఒక్కటవ్వడం గ్యారెంటీ అన్నది టాలీవుడ్ టాక్. మొదట్లో నాగ్ ఈ పెళ్లికి అంగీకరించకపోయినా.. చైతూ కోసం తలాడించక తప్పలేదని తెలుస్తోంది. అయితే ఈ విషయమై చైతూ, నాగార్జున మధ్య విపరీతమైన వాగ్వాదాలు జరిగాయని సమాచారం. చైతూ ఇష్టాన్ని కాదనలేక.. సమంతని కోడలుగా స్వీకరించడానికి నాగార్జున కుటుంబం ఒప్పుకొంది. అయితే నాగ్ ఒకే ఒక్క కండీషన్ పెట్టారట. ”పెళ్లయ్యాక.. సమంత సినిమాలకు దూరంగా ఉండాలి” అని. దానికి చైతూ కూడా అంగీకరించాడని తెలుస్తోంది.
అయితే సమంతకు మాత్రం.. ఆడపా దడపా సినిమాలు చేయాలనే ఆకాంక్షను వ్యక్తం చేస్తోందట. అందుకే ఓసారి ‘సినిమాలంటే బోర్ కొట్టేశాయి’ అని, మరోసారి ‘మంచి కథ వస్తే చేస్తా’ అని పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు చేస్తోంది సమంత. అయితే పెళ్లయ్యాక కనీసం యేడాది పాటు సమంత సినిమాలకు దూరం అవుతుందని, ఆ తరవాతే.. పరిస్థితుల్ని బట్టి నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. నాగార్జున కుటుంబం మాత్రం ‘సమంత సినిమాల్లో నటించకూడదు’ అని గట్టిగా చెబుతోందట. దాంతో సమంతని ఎలా కన్వెన్స్ చేయాలో అర్థం కాక చైతన్య తికమకపడుతున్నాడని తెలుస్తోంది. మరి.. సమంత చైతూ కోసం సినిమాలకు దూరం అవుతుందా? లేదంటే ఈ విషయంలో తన పంతం నెగ్గించుకొంటుందా? అనే విషయాలు ఆసక్తికరంగా మారాయి.