తిరుపతి ఉపఎన్నికల్లో జరిగిన అక్రమాలు ప్రజాస్వామ్యాన్ని మర్డర్ చేయడం వంటివేనని తాజా పరిణామాలతో స్పష్టమవుతోంది. అయితే పాత్రధారుల్ని సస్పెండ్ చేస్తున్నారు కానీ అసలు సూత్రధారులెవరు అన్నదానిపై ఎవరూ దర్యాప్తు చేపట్టడం లేదు. ఎందుకంటే అసలు పాత్రధారులు, ప్రజాస్వామ్యహంతకులు ప్రభుత్వ పెద్దలే. అన్నీ తాడేపల్లి ప్యాలెస్ నుంచి జరిగిన కుట్ర ప్రకారమే… వ్యవహారం అంతా నడిచింది. అందుకే అసలు బాధ్యతలే ఇవ్వని అధికారి నేరుగా ఈఆర్వోగా చేరిపోయి.. వ్యవహారం అంతా నడిపించగలిగారు. ఇంత కంటే ప్రభుత్వ ఘోరానికి సాక్ష్యం ఇంకోటి అక్కర్లేదు.
ఎన్నికలే దేశ ప్రజాస్వామ్యానికి పిల్లర్. అది బలహీనపడితే దేశం కూడా బలహీనపడినట్లే. అయితే ఈ ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేశారు.. వారిపై ఈసీ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నారు కానీ.. సూత్రధారుల జోలికి వెళ్లడం లేదు. వాళ్లను శిక్షిస్తే తప్ప మరోసారి అలాంటి పనులు చేయరు. అయితే అధికారం వారి చేతుల్లో ఉంది కాబట్టి చూసీ చూడనట్లుగా ఉండిపోతున్నారు. ఈసీ ఆదేశాలను కూడా అతి కష్టం మీద అమలు చేస్తున్నారు.
ఒక్క తిరుపతి కాదు ప్రతిపక్షాలు పోటీ చేయని ఆత్మకూరు, బద్వేలు ఉపఎన్నికల్లోనూ టూరిస్టు బస్సులతో వచ్చి ఓట్లు వేయించారు. ఎక్కడ ఎన్నికల అక్రమాలపై విచారణ చేయిస్తే.. ఇంకెన్ని విచిత్రాలు బయటపడతాయో. క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న లీడర్ నేతృత్వంలో వ్యవస్థలు ఉంటే.. అన్నీ నేర పూరితం అవుతాయని.. శాస్త్రీయంగా నిరూపించేశారు… !