వరద బాధితులు ఎదురు చూస్తున్నారు. ఎవరైనా వస్తారేమోనని…! . వరద బాధితులు అరుస్తున్నారు.. ఎవరైనా వింటారేమోనని..!. కానీ.. ఎవరూ వినడం లేదు.. ఎవరూ కనడం లేదు. నేను ఉన్నాను.. నేను విన్నాను.. అని చెప్పిన… నేతలెవరూ.. ఇప్పుడు.. వరద బాధితుల దరిదాపుల్లోకి రావడం లేదు. వరద క్రమంగా తగ్గుముఖం పడుతున్నా… ఇళ్లను నిండా ముంచేసినప్పటి నుంచి.. ప్రభుత్వం తరపున 80శాతం మందికి కనీసం.. అరకొర సాయం కూడా చేయలేదు. అత్యంత దిగువ ప్రాంతాల చెందిన వారిని… షెల్టర్ జోన్లకు తరలించారు కానీ..వారికి కనీస అవసరాలు తీర్చే ప్రయత్నం చేయలేదు. దాంతో… వరద బాధితులు రోడ్డున పడాల్సి వచ్చింది. నిజానికి ఏపీలో.. పెద్దగా వర్షాలు లేవు. కేవలం.. ఎగువ నుంచి వస్తున్న వరదను సరిగ్గా .. నిర్వహించకపోవడం వల్లే..కృష్ణా పరివాహక ప్రాంతంలోని.. గ్రామాలు నీట మునిగాయి.
ముఖ్యంగా.. పులిచింతల దగ్గర నుంచి… ఈ ప్రభావం ఉంది. లంక గ్రామాలన్నీ నీటిలో మునిగిపోయాయి. వరద ఇంత తీవ్రంగా వస్తుందని.. వారం రోజుల ముందుగానే.. ఏపీ సర్కార్ కు స్పష్టమైన సమాచారం ఉన్నప్పటికీ.. ఎవర్నీ ఖాళీ చేయించలేదు. ఇళ్లు మునిగిన తర్వాత కొంత మందిని తరలించారు కానీ.. అదీ కూడా.. తూ..తూ మంత్రమే మిగతా వారు.. ఎవరికి వారు ప్రాణాలు కాపాడుకుంటూ.. ఎత్తయిన ప్రాంతాలకు వెళ్లారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిబిరాల్లోనూ.. కనీసం.. వసతులు ఏర్పాటు చేయలేదు. భోజనం పెట్టాలంటే.. ఆధార్ కార్డు చూపించాలన్న నిబంధన పెట్టారు. దాంతో బాధితుల బాధ వర్ణనాతీతం. ఎగువ నుంచి వస్తున్న వరద … తగ్గుముఖం పట్టినా… గ్రామాలు నీటిలో నే ఉన్నాయి. నీటి ముంపు నుంచి బయటపడిన చోట… ఇళ్లలో బురద పేరుకుపోయింది.
వీరెవరికీ ప్రభుత్వం తరపున సాయం అందడం లేదు. అనేక చోట్ల బాధితుల ఆగ్రహం స్పష్టంగానే కనిపిస్తోంది. అధికారయంత్రంగా పట్టించుకునేవారు లేకపోవడంతో.. మరింత నిర్లిప్తంగా వ్యవహరిస్తోంది. నేను ఉన్నాను.. నేను విన్నాను అని.. జగన్మోహన్ రెడ్డి ప్రచార నినాదం.. ఎన్నికల ముందు వరకేనని..సీఎం అయిన తర్వాత ఆయన వినడం లేదు… ఉండటం లేదనే.. విమర్శలు ప్రారంభమయ్యాయి.