జగన్ అనుకున్నారు.. డిసైడ్ అయిపోయారు. మైండ్ లో అనుకుంటే బ్లైండ్‌గా వెళ్లిపోతారు అని వైసీపీ నేతలు చాలా మాటలు చెప్పారు కానీ అంతా ఉత్తదేనని తేలిపోయింది. దసరా నుంచి విశాఖలో జగన్ పాలన మొదలు పెడతారని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయిపోయినట్లేనని వైసీపీ నేతలు చెబుతూ వస్తున్నారు. కానీ జగన్ మాత్రం ఈ దసరాకు తాడేపల్లి నుంచే పాలన చేయనున్నారు. వైసీపీ అనుకూల మీడియా.. సోషల్ మీడియాల్లో జరిగిన ప్రచారం అంతా ఉత్తదేనని తేలిపోయింది.
నిజానికి ఇది మొదటి సారి కాదు. జగన్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల నుంచి ఇదే కథ. ఇక జగన్ విశాఖ వెళ్లడమే మిగిలిందని ప్రచారం చేస్తూ వస్తున్నారు. కానీ ఆయన మాత్రం ముందుకు రావడంలేదు. సీఎం ఎక్కడి నుంచి అయినా పరిపాలన చేయవచ్చని..గతంలో జగన్ స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు. ఆ మాట ప్రకారం అయినా కొంత కాలం వైజాగ్‌లో క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసుకుని ఉండవచ్చు. కానీ అలాంటి ప్రయత్నం చేయడం లేదు. కానీ ప్రచారం మాత్రం చేసుకుంటున్నారు.
వైజాగ్‌లో సీఎం పరిపాలన ప్రారంభిస్తే అసలు సమస్యలేమిటో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మూడు రాడధానులు కాదు.. అనధికారికంగా రెండు రాజధానులు ఉన్నా.. ప్రజలు ఎంత ఇబ్బంది పడుతారో తెలుస్తుంది.అధికార వర్గం కిందా మీదా ఎలా పడుతుందో తెలుసుకోవచ్చు. సమస్యలన్నీ ప్రాక్టికల్‌గా అర్థమవుతాయి. అయితే పాలకులు మాత్రం తమ సమస్యల గురించి తెలుసు కాబట్టి ప్రజలతో ఎమోషనల్ గేమ్ ఆడటానికి ప్రయత్నిస్తున్నారు…తప్ప.. వారికీ చిత్తశుద్ధి లేదన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది.