స్టార్ హీరో సినిమా అంటే… బెనిఫిట్ షోలు, ఫ్యాన్స్ షోల హంగామా ఉండాల్సిందే. అర్థరాత్రి ఆటలంటే ఫ్యాన్స్కి అదో కిక్కు. అయితే కొంతమంది హీరోలు బెనిఫిట్ షో అంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. నెగిటీవ్ టాక్ ఎక్కువగా స్పైడ అవుతోందని, తెల్లారేసరికి నాన్ ఫ్యాన్స్ పనిగట్టుకొని ఫ్లాప్ టాక మోస్తున్నారని, దాంతో ఆ ప్రభావం రిలీజ్ రోజున వసూళ్లపై పడుతోందని వాళ్ల భయం అందుకే… కొంతమంది హీరోలు బెనిఫిట్ షోలకు ససేమీరా అంటున్నారు. అల్లు అర్జున్ కూడా అంతే. అర్థరాత్రి ఆటలపై బన్నీకి సదాభిప్రాయం లేదు. సరైనోడు సమయంలో బెనిఫిట్ షోకి నో చెప్పాడు బన్నీ. ఇప్పుడూ అంతే. బన్నీ నుంచి వస్తున్న కొత్త సినిమా డీజే. ఈ సినిమాకీ బెనిఫిట్ షోలు లేవు. ఫ్యాన్స్ ఎంత బలవంతం చేసినా, అర్థరాత్రి షోలకు బన్నీ అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది. నైజాంలో బెనిఫిట్ షోలు దాదాపుగా లేనట్టే. మిగిలిన ప్రాంతాల్లో విడుదల రోజున ఉదయం 6 గంటల నుంచి షోలు పడే అవకాశం ఉంది. ఓవర్సీస్ లో మాత్రం ఓ రోజు ముందుగానే ప్రీమియర్లు ప్లాన్ చేస్తున్నారు.