కృష్ణవంశీ సినిమా అంటే ఎంతో కొంత గురి. క్రియేటీవ్ దర్శకుడు కదా? ఎప్పుడు ఎలాంటి అద్భుతాలొస్తాయో చెప్పలేం. గోవిందుడు అందరి వాడేలే సినిమా ఫ్లాప్ అయినా.. నక్షత్రంపై ఎవ్వరికీ చిన్న చూపులేదు. సందీప్‌కిషన్, సాయిధరమ్ తేజ్లని తీసుకొని దీనికో మల్టీస్టారర్ లుక్ తీసుకొచ్చేప్రయత్నం చేశాడు కృష్ణవంశీ. దానికి తోడు రెజీనా, ప్రగ్యా, శ్రియ… ఇలా గ్లామర్ కు లోటు లేకుండా చేశాడు. మరో ఖడ్గం అయ్యే ఛాన్సుందన్న భ్రమలు కల్పించాడు. దాంతో.. నక్షత్రంపై బయ్యర్ల ఫోకస్ పెరిగింది. మరీ భారీ రేట్లు ఇచ్చి కాకపోయినా… రీజనబుల్ రేట్లకు నక్షత్రం సినిమాని కొందామనుకొన్నారు. అయితే… ఇటీవల విడుదలైన ట్రైలర్ చూసి.. ఇప్పుడు జంకుతున్నారని తెలుస్తోంది. నక్షత్రం ట్రైలర్ ఈమధ్యే విడుదలైంది. చూస్తే… అరుపులు కేకలు తప్ప ఇంకేం కనిపించలేదు. ఇదోదో డబ్బింగ్ సినిమా ట్రైలర్‌లా అనిపించింది తప్ప, కృష్ణవంశీ మార్క్ ఎక్కడా కనిపించలేదు. దాంతో.. బయ్యర్లు ఇప్పుడు భయపడుతున్నార్ట.
కృష్ణవంశీ ఆఖరి క్షణం వరకూ సినిమాని చెక్కుతూనే ఉంటాడు. సినిమా రిలీజ్ డేట్ ప్రకటించినా… చెప్పిన టైమ్‌కి బయటకు వస్తుందో రాదో చెప్పలేం. అదీ… వసూళ్లపై ప్రభావం చూపిస్తుందన్నది బయ్యర్ల అనుమానం. దాంతో… పాటలు, ట్రైలర్ విడుదలకు ముందొచ్చిన ముగ్గురు నలుగురు బయ్యర్లు కూడా ఇప్పుడు.. వెనక్కి వెళ్లిపోయారని తెలుస్తోంది. నక్షత్రం రిలీజ్ డేట్ బయటకు రావాలంటే… కొనేవాళ్లు ముందుకు రావాలి. అదెప్పుడో మరి. మరో ట్రైలర్ విడుదల చేసి.. ఆకట్టుకొంటే తప్ప – నక్షత్రంని కొనరేమో.