కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాలకు క్రేజ్ పెరుగుతోంది. అనుష్క దయ వల్ల హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా కెపాసిటీ రూ.50 కోట్లు దాటింది. మధ్యలో స్వాతి, అంజలిలాంటి వాళ్లు కూడా తమ సినిమాల్ని బాగానే మార్కెట్ చేసుకొంటున్నారు. వీళ్లకంటే సీనియర్.. వీళ్లందరికంటే తన ఖాతాలో ఎక్కువ హిట్లు వేసుకొన్న త్రిష సినిమాకి మాత్రం గిరాకీ లేకుండాపోయింది. త్రిష తన కెరీర్లో నాయకి ద్వారా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు శ్రీకారం చుట్టింది. ఇదో థ్రిల్లర్ సినిమా. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కింది. హారర్, థ్రిల్లర్ సినిమాలకు మంచి గిరాకీ ఉన్న ఈ సమయంలో, అదీ త్రిష నటించిన సినిమా అంటే.. హాట్ కేకులా అమ్ముడుపోతుందని భావిస్తారంతా. కానీ.. ఈ సినిమాకి మాత్రం ఇప్పటి వరకూ బయ్యర్లు రాలేదు. సినిమా పూర్తయి ఇన్ని రోజులైనా.. ఇంకా రిలీజ్ డేట్ ఫిక్స్ కాకపోవడానికి కారణం ఎవరూ ఈ సినిమాపై ఆసక్తి చూపించకపోవడమే అని తెలుస్తోంది.
తమిళంలో కొన్ని ఆఫర్లు వస్తున్నా.. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయాలని చిత్రబృందం భావించడంతో తెలుగు లో మార్కెట్ ముగిసేవరకూ విడుదల తేదీ ప్రకటించే అవకాశం లేకుండా పోయింది. కొత్తగా ట్రైటర్లు, టీజర్లు వదిలి, ఈ సినిమాపై ఫీలర్లు సృష్టించి, పబ్లిసిటీ పెంచితే తప్ప ఈ సినిమాపై ఆసక్తి పెరగదు. అందుకే ప్రస్తుతం ఈ సినిమాకి ప్రచారం పెంచే విషయంపై చిత్ర బృందం తర్జన భర్జనలు పడుతోందని టాక్.