అంగళ్లులో చంద్రబాబుపై హత్యాయత్నం చేసి.. మళ్లీ చంద్రబాబుపై రివర్స్ కేసులు పెట్టారు వైసీపీ నేతలు. అది కూడా నాలుగు రోజులు ఆలస్యంగా. ఇప్పుడు ఆ కేసులో సాక్ష్యాల్లేని పోలీసులు మూసివేతకు కోర్టులో పిటిషన్ వేశారు. అయితే దీనిపైనా వైసీపీ రాజకీయం చేస్తోంది. కానీ పోలీసులు ..అసలు చంద్రబాబుపై హత్యాయత్నం చేసిన వారిపై ఎందుకు కేసులు పెట్టడం లేదన్న ప్రశ్న వస్తోంది. అంగళ్లులో చంద్రబాబుపై భయంకరమైన రాళ్ల దాడి జరిగింది. ఆ వీడియో సాక్ష్యాలు కూడా ఉన్నాయి. అయినా ఇంత వరకూ కేసులు పెట్టలేదు.
చంద్రబాబుకు ఉన్న సెక్యూరిటీ ,ఆయన పై జరిగిన దాడి విషయంలో కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. చంద్రబాబుపై ఫిర్యాదు చేసిన వైసీపీ నేత ఉమాపతిరెడ్డిపై ప్రధానంగా చంద్రబాబును హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లుగా కేసు పెట్టాల్సి ఉంది. రాళ్ల దాడికి మనుషుల్ని తీసుకు వచ్చింది ఆయనే. నాలుగు రోజుల తర్వాత తాడేపల్లి కుట్రలో భాగంగా ఆయనే కేసు పెట్టారు. ఇప్పుడు ఆయనపై వీడియో సాక్ష్యాల ఆధారంగా కేసులు పెట్టాల్సి ఉన్నా పోలీసులు పట్టించుకోవడం లేదు.
తప్పుడు కేసులో సాక్ష్యాలు చూపించకుండా… పోలీసులపై ఆరోపణలు చేస్తున్న వ్యక్తిని ఎలా వదిలేస్తారో పోలీసులకే తెలియాలి. వైసీపీ హయాంలో నమోదైన వేలాది కేసులు తప్పుడు కేసులు. ఓ సాక్ష్యం కూడా ఉండదు. అందులో చాలా వరకూ రివర్స్ కేసులు. అలా తప్పుడు కేసులు పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటేనే మరోసారి రాజకీయ కేసుల్లో నేతలు .. అతిగా వెళ్లరు.