పవన్ – రానాల మల్టీస్టారర్ `అయ్యప్పయున్ కోషియమ్`. సాగర్ చంద్ర దర్శకుడు. అయితే తెర వెనుక కర్త, కర్మ, క్రియ మాత్రం త్రివిక్రమ్ నే. ఈ ప్రాజెక్ట్ సెట్ చేసిందే ఆయన. మాటలు – స్క్రీన్ ప్లే కూడా ఆయనే అందిస్తున్నారు. ఓరకంగా… ఈ సినిమాకి ఆయనే ఘోస్ట్ డైరెక్టర్ అనే ప్రచారం జరుగుతోంది. పవన్ కల్యాణ్ ఇమేజ్‌కీ, బాడీ లాంగ్వేజ్ కి అనుగుణంగా కథలో చాలా మార్పులు – చేర్పులూ చేశారని, మాతృక కంటే… ఈ రీమేక్ భిన్నంగా ఉండబోతోందని ప్రచారం జరుగుతోంది. త్రివిక్రమ్ హ్యాండ్ కదా… భారీ మార్పులు తప్పనిసరి అని అభిమానులూ ఊహిస్తారు.
కానీ వాస్తవానికి.. అయ్కయప్పయుమున్ కోషియమ్ రీమేక్ లో త్రివిక్రమ్ మార్పులు చేర్పులూ చేసిందేం లేదట. ఉన్నది ఉన్నట్టుగానే.. కాస్త స్టయిలీష్ గా తీస్తున్నారట. దాదాపు మాతృకకి కట్ అండ్ పేస్ట్ లా ఉంటుందని, మాతృకలో ఉండని కొన్ని ఎపిసోడ్లు మాత్రమే త్రివిక్రమ్ జోడించాడని, అది కూడా కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమని తెలుస్తోంది. వర్జినల్ లో ఏదైతే బలమైన ఎమోషన్ ఉందో అది మిస్ అవ్వకూడదన్న ఉద్దేశంతోనే అసలు కథని, అందులోని క్యారెక్టరైజేషన్లనీ.. త్రివిక్రమ్ ముట్టుకోలేదని సమాచారం. నిజానికి.. ఈ స్క్రిప్టుని సాగర్ చంద్ర ముందే రాశాడు. దానికి త్రివిక్రమ్ సంభాషణలు మార్చాడంతే. ఒకట్రెండు కొత్త ఎపిసోడ్లు తెరపై కనిపిస్తాయని, అవి మాత్రం త్రివిక్రమ్ జోడించాడని, మిగిలినదంతా సేమ్ టూ సేమ్ అని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సంక్రాంతి బరిలో నిలిపిన సంగతి తెలిసిందే. జనవరి 12న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.