బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ సూపర్‌హిట్. బోయపాటి తీసిన ‘సరైనోడు’ సినిమాలో స్పెషల్ సాంగ్ భాషలో చెప్పాలంటే బ్లాక్‌బస్టరే. ఇద్దరి ప్రయాణంలో ‘సింహా’, ‘లెజెండ్’ చిత్రాలు చిరస్మరణీయ విజయాలుగా నిలిచాయి. రెండు బ్లాక్‌బస్టర్స్ తరవాత ముచ్చటగా మూడోసారి వీరిద్దరూ కలిసి మూడో చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే.
ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో వేడుకలో ఈ చిత్రాన్ని ప్రకటించారు. బాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. సినిమా ప్రకటనతో పాటు ఫిబ్రవరిలో చిత్రీకరణ ప్రారంభిస్తామని తెలిపారు. ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రీకరణ కాస్త ఆలస్యం కావడం, విడుదల ఓ వారం వెనక్కి వెళ్లడంతో బోయపాటితో బాలయ్య చేసే మూడో చిత్రం కాస్త ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశాలు వున్నాయని ఫిల్మ్‌నగర్‌లో వినిపించాయి. సినిమాపై పుకార్లూ వచ్చాయి.
సినిమా సన్నిహిత వర్గాల సమాచారం మేరకు… ఫిబ్రవరిలో చిత్రీకరణ మొదలవుతుంది. షెడ్యూళ్లలో ఎలాంటి మార్పుల్లేవ్. ‘సింహా’, ‘లెజెండ్’ చిత్రాల తరవాత బాలయ్య, బోయపాటి కాంబినేషన్లో వస్తున్న చిత్రం కనుక నందమూరి అభిమానులు, ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. వాటిని చేరుకునేలా ‘సింహా’ స్టైల్లో అద్భుతమైన కథను బోయపాటి సిద్ధం చేశార్ట.