అరవింద సమేత వీర రాఘవ ఆడియో ఫంక్షన్ రద్దయ్యింది. ఎలాంటి వేడుక లేకుండా పాటల్ని విడుదల చేశారు. ఎన్టీఆర్ పితృవియోగంతో ఉన్నప్పుడు ఆడియో ఫంక్షన్లలాంటివి ఆశించడం కూడా తప్పే. అయితే ప్రీ రిలీజ్ వేడకతో అభిమానులకు ట్రీట్ ఇవ్వబోతోంది అరవింద టీమ్. ప్రస్తుతం చిత్రబృందం ఫారెన్ లొకేషన్లో ఉంది. అక్కడ `అనగనగ` టైటిల్ సాంగ్‌ని చిత్రీకరిస్తున్నారు. ఫారెన్షెడ్యూల్ అవ్వగానే ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేయబోతున్నారు. అక్టోబరు 2న హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ వేడుక చేయాలని ముందుగా నిర్ణయించుకున్నారు. ఇప్పుడు డేట్ మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. 3 నగానీ, 6న గానీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ వేడుక నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. ఈ శుక్రవారానికి చిత్రబృందం హైదరాబాద్ తిరిగిరానుంది. ఆ తరవాతే… ప్రీ రిలీజ్ ఫంక్షన్‌పై ఓ క్లారిటీ వస్తుంది. ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ అతిథిగా రానున్నాడని ప్రచారం జరుగుతుంది. అయితే… ఈ విషయంలోనూ ఎలాంటి క్లారిటీ లేదు. దాదాపుగా అతిథులు లేకుండానే, కేవలం చిత్రబృందం సమక్షంలోనే ఈ కార్యక్రమం నిర్వహించాలని భావిస్తున్నట్టు సమాచారం. సో.. బాలయ్యని ఈ వేదికపై చూసే అవకాశం దాదాపుగా లేనట్టే. అక్టోబరు 11న `అరవింద సమేత` ప్రేక్షకుల ముందుకు రానుంది.