ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరికి బాధ్యతలు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారో హైకమాండ్ కూ సరైన స్పష్టత ఉందో తెలియని పరిస్థితి. ఆమె బాధ్యతలు చేపట్టిన దగ్గర్నుంచి వైసీపీని టార్గెట్ చేస్తున్నారు కానీ.. మాటలతోనే పరిస్థితి మారిపోయే సీన్ లేదు. ఏపీలో అసలు లేదు. అందుకే.. సోము వీర్రాజు గతంలో చేసిన ఆరోపణల్నే పురందేశ్వరి చేస్తున్నా… పెద్దగా ఇంపాక్ట్ కనిపించడం లేదు. ఆమె మాత్రం తన బాధ్యతగా వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. తన మీద పూర్తి బాధ్యత ఉందంటున్నారు.
వైసీపీకి బీజేపీ యాంటీ అని నిరూపించాలంటే పురంందేశ్వరిని అధ్యక్షురాలిగా పెట్టి… విమర్శలు చేయిస్తే సరిపోదని.. ఏపీలో కళ్ల ముదు కనిపిస్తున్న స్కాంలు హత్యానేరాల్లో ఇరుక్కున్న హై ప్రోఫైల్ వ్యక్తుల్ని కాపాడటం వంటివి ఆపేయాల్సి ఉంటందని అంటున్నారు. ఆ సహకారం కొనసాగిస్తూ పైకి విమర్శలు చేస్తే ఎవరూ నమ్మకపోగా.. భవిష్యత్ లో కూడా నమ్మని పరిస్థితి ఏర్పడుతుంది. అంతిమంగా ఢిల్లీ రాజకీయాల్లో నేతలు బాగానే ఉంటారు.. కానీ గల్లీ రాజకీయ నేతలు మాత్రం.. తమ రాజకీయ భవిష్య త్ ను పణంగా పెట్టాల్సి ఉంటుంది.
అంతో ఇంతో ఊపు ఉందనుకున్న తెలంగాణలోనే బీజేపీ చేతులెత్తేసి.. వచ్చే ఎన్నికల తర్వాత కలిసి వచ్చే పార్టీ కోసం మెత్తబడిందని చెబుతున్నారు. ఇప్పుడు .. అసలు ఆసల్లేని ఏపీలో ఏం చేస్తుందన్నది మాత్రం సందేహమే. తమిలనాడులో అన్నామలై .. కాస్త పోరాడుతున్నాడంటే.. కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి వస్తున్న సహకారమే. అలాంటిది అందించకుండా… తెలుగు రాష్ట్రాల్లో ఎవరిని చీఫ్లుగా నియమించినా ప్రయోజనం సున్నానని ఆ పార్టీ నేతలు గొణుక్కుంటున్నారు.