‘రోబో 2.ఓ’ ఎప్పుడొస్తుందన్నది బిలియన్ డాలర్ల ప్రశ్న. ఇప్పటికే ఈ సినిమా విడుదల తేదీ.. చాలాసార్లు మారింది. ఏప్రిల్ 27న రోబో రాబోతోందని చెబుతున్నా.. అప్పటికీ నమ్మకాలు కుదరడం లేదు. చిత్రబృందం ‘ఈసారి తప్పకుండా వస్తాం’ అని గట్టిగాచెబుతున్నా.. ‘ఈసారి కూడా రజనీ హ్యాండ్ ఇవ్వడం గ్యారెంటీ’ అని తమిళ సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
‘రోబో 2.ఓ’ ఓ టెక్నికల్ సినిమా. స్పెషల్ ఎఫెక్ట్స్‌కి చాలా సమయం వెచ్చించాల్సి ఉంటుంది. ఓసారి సీజీ వర్క్ చేతిలోకి సినిమా వెళ్లిపోయిన తరవాత అవి ఎప్పుడు పూర్తవుతాయో చెప్పలేం. దానికి తోడు ఈ సినిమాపై శంకర్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. సీజన్ కోసం హడావుడి పడిపోయి సినిమా విడుదల చేయడం శంకర్‌కి ఇష్టం లేదు. అనుకున్న సమయానికి సినిమా విడుదల చేయడం కష్టమని చిత్రబృందానికీ తెలుసు. కానీ… సినిమాని పెద్ద పెద్ద రేట్లకు కొనుక్కొన్న పంపిణీదారులకు సమాధానం చెప్పడానికైనా, ఏదో ఓ విడుదల తేదీ ఫిక్స్ అవ్వాల్సి ఉంటుంది. అందుకే ఏప్రిల్ 27న అని చెప్పి ఊరుకున్నాడని ఫిల్మ్‌నగర్ వర్గాలు చెబుతున్నాయి. అల్లు అర్జున్ నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా ఏప్రిల్ 27న రాబోతోంది. వాళ్ల ధైర్యం కూడా ఇదే. ఆ రోజున రజనీకాంత్ సినిమా రావట్లేదని వాళ్లకు స్పష్టంగా తెలిసింది కాబట్టే… ఆ రోజున ఫిక్సయ్యారు. సో.. ‘రోబో 2’ మళ్లీ హ్యాండ్ ఇవ్వడం ఖాయంనే కనిపిస్తోంది.