సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో ఈ ఆదివారమే జరగబోతోంది. ఆడియో ఫంక్షన్లంటే ఏమాత్రం ఇంట్రస్ట్ చూపించని పవన్.. తన కెరీర్లోనే తొలిసారి అత్యంత భారీగా సర్దార్ ఆడియో ఫంక్షన్ నిర్హించాలని ప్లాన్ చేశాడు. అందుకోసం నిజాం కాలేజ్ గ్రౌండ్స్, లేదంటే గచ్చి బౌలి స్టేడియంలో ఫంక్షన్ చేయాలని భావించాడు. ఆడియో రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా… అనుమతులు మాత్రం లభించలేదు. దాంతో సర్దార్ ఫంక్షన్‌పై కన్ఫ్యూజన్లు నెలకొన్నాయి. వీటన్నింటికీ తెరదించింది సర్దార్ బృందం.
హైదరాబాద్‌లోని నోవోటెల్ని సర్దార్ ఫంక్షన్ కోసం బుక్ చేసింది సర్దార్ టీమ్. దాంతో…. సర్దార్ వేడుక ఎక్కడన్నది ఖాయమైపోయింది. 20వ తేదీ సాయింత్రం 7 గంటలకు ఎట్టిపరిస్థితుల్లోనూ సర్దార్ ఆడియో ఫంక్షన్ స్టార్ట్ చేసి పది గంటలలోపు ముగించాలని పవన్ అల్టిమేట్టం జారీ చేశాడట. ఈ కార్యక్రమాన్ని లైవ్ లో ప్రసారం చేయడానికి రెండు ఛానళ్లకు అనుమతులు ఇచ్చేశారని తెలుస్తోంది. దాని ద్వారా చిత్రబృందం దాదాపు కోటి రూపాయల ఆదాయం అందుకొందట. పవన్ సినిమా అంటే క్రేజ్ ఇలానే ఉంటుంది మరి.